వేటపాలెం: వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై వీర వసంతరావు అనే హోంగార్డు కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయ్‌పేటలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ముందు వేటపాలెం-చీరాల రోడ్డులో నేటి ఉదయం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వర్లు, వసంతరావుల స్వగ్రామం యాదవపాలెం. వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి చీరాలకు పూలు అమ్మడానికి వెళ్తున్నాడు. దారి మధ్యలో వెంకటేశ్వర్లును కలిసిన వసంతరావు చిట్టీ డబ్బుల విషయం అడిగాడు.
వీరిద్దరి మధ్య చిట్టీ డబ్బుల విషయంలో భిన్న అభిప్రాయాలు రావడంతో హోంగార్డు వసంతరావు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.