పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
డీజీపీ అనురాగ్‌శర్మ
జహీరాబాద్: రాష్ట్రంలో చేపట్టబోయే పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తున్నామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. శనివారం ఆయన మెదక్ జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ పంచాయతీ పరిధిలోని లాల్‌సింగ్‌తండా శివారులో 25 ఎకరాల్లో పోలీసు ఫైరింగ్ రేం జ్‌కు, చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు చెక్‌పోస్టుకు శంకుస్థాపన చేశా రు. జహీరాబాద్ పోలీసు స్టేషన్ ఆవరణలో రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన రిసెప్షన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీసులు.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
65వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ రే ంజ్ ఐజీ నవీన్‌చంద్, కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ సుమతి పాల్గొన్నారు. కాగా మెదక్ జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ పంచాయతీ పరిధిలోని లాల్‌సింగ్ తండా శివారులోగల 25 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన పోలీసు ఫైరింగ్ జోన్ పనులకు డీజీపీ శంకుస్థాపన చేశారు.