హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం విడుదల చేశారు. మొత్తం 4,93,197 మంది పరీక్ష రాయగా 1,92,588 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 47 శాతం మంది అభ్యర్థులు అర్హత పొందారు. ఈ కార్యక్రమంలో పోలీసు, జేఏన్‌టీయూ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.