నయీం కేసులో మరో కొత్త మలుపు | five cops suspended for suspected links with gangster nayeem | Sakshi
Sakshi News home page

నయీం కేసులో మరో కొత్త మలుపు

Published Thu, May 11 2017 7:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

నయీం కేసులో మరో కొత్త మలుపు

నయీం కేసులో మరో కొత్త మలుపు

గ్యాంగ్‌స్టర్ నయీం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌ (మీర్‌చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడింది.

వీరిలో మద్దిపాటి శ్రీనివాస్ పేరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వినిపించింది. మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐదుగురిని సస్పెండ్ చేయగా, నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది, 16 మందిని స్వల్ప శిక్షలతో సరిపెడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నయీం కేసు మరోసారి వెలుగులోకి రావడం, అందులో పోలీసులపై చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement