సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను కోరింది. దీంతో అధికారులు నయీం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నయాం కేసులో బీసీ సంఘాల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఈ కేసులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరినవారే కావడం గమనార్హం. నయీం కేసును సిట్‌కు అప్పగించిన తర్వాత 250 కేసుల నమోదు అయ్యాయి. అంతేకాకుండా 1.944 కేజీల బంగారం, 2,482 కేజీల వెండి, రెండు కోట్ల రూపాయలకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు.
ఆ జాబితాలోని పేర్లు...
- అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్‌రెడ్డి
- డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య
- పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న
- ఇన్‌స్పెక్టర్లు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకటరెడ్డి, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేంద్రగౌడ్, దినేశ్, సాదిఖ్‌మియా
- టీఆర్‌ఎస్ నాయకులు.. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్, వెల్దండ టీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య
- మాజీ సర్పంచ్ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ్
2016లో షాద్‌నగర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్‌ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంటకాగి.. భారీగా భూ దందాలు సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment