రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసింది.
డీజీపీకి అడ్వకేట్స్ జేఏసీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసింది. డీజీపీ విదేశీ పర్యటనలో ఉండటంతో ఆదివారం టి.అడ్వకేట్స్ జేఏసీ నేతలు ఫిర్యాదు పత్రాన్ని పోలీసు ప్రధాన కార్యాలయంలో అందజేశారు.
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సభలు, సమావేశాలతో పాటు ప్రెస్‌మీట్‌లలో కూడా సీఎం కేసీఆర్‌పట్ల అగౌరవంగా మాట్లాడటమే కాకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా రేవంత్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టి.అడ్వకేట్స్ జేఏసీ నేతలు కె.గోవర్ధన్‌రెడ్డి, ఎస్.జనార్దన్‌గౌడ్, వి.రవికుమార్, కె.నరేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.