రూ.కోట్లకు కేసీఆర్ కక్కుర్తి: రేవంత్
అమ్రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లకు కక్కుర్తి పడి నల్లమల గుండెల మీద యురేనియం తవ్వకాలు చేపడుతున్నా రని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. నల్ల మలలో యురేనియం తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో నిర్వహిం చిన ప్రజా యుద్ధభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చినప్పుడు చెంచుపెంటలు తిరిగి వగల కన్నీరు పెట్టిన ఎంపీ కవిత.. ఇప్పుడు ‘మీ అయ్య, అన్న యురేనియం తవ్వకాలకు అనుమతులిస్తే ఏమి చేస్తుంది. టీడీపీని ఆంధ్రా పార్టీ అంటావు.. మరి మూడు తరాల ముందుకుపోతే మీది బిహార్ కాదా’అని ఎద్దేవా చేశారు.