తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ | National identity to Telangana Police: DGP | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ

Published Thu, Jun 15 2017 2:26 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ - Sakshi

తెలంగాణ పోలీస్‌కు దేశవ్యాప్త గుర్తింపు: డీజీపీ

పోలీస్‌ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారం
 
సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ క్రీడాకారులు సాధించిన పతకాలతో దేశం మొత్తంలో తెలంగాణ పోలీస్‌కు ఆల్‌రౌండర్‌గా గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఆలిండియా స్పోర్ట్స్‌ డ్యూటీ మీట్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 105 మంది పోలీస్‌ క్రీడాకారులకు రూ.70 లక్షల నగదు పురస్కారాలను బుధవారం పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్‌ క్రీడాకారుల ప్రాక్టీస్‌ కోసం ప్రత్యేకంగా జపాన్, కెనడా, ఇటలీ తదితర దేశాల నుంచి ఫైరింగ్‌ ఆర్మ్స్‌ను రూ.2.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని, దీనికి తగ్గట్టుగా ఫలితాలు రావాలని ఆశిద్దామని పేర్కొన్నారు.

మంచి ఫలితాలు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్‌ క్రీడాకారులను ముందు నుంచి తోడ్పాటు అందిస్తున్న హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేదీతోపాటు స్పోర్ట్స్‌ ఐజీ శ్రీనివాస్‌రావులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. దేశంలోనే ది బెస్ట్‌ డాగ్‌ అనిపించిన రీటా సైతం రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని అందుకోవడం విశేషం. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు గోపీకృష్ణ, రవిగుప్తా, శివధర్‌రెడ్డి, మల్లారెడ్డి, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్‌ జైన్, సౌమ్యా మిశ్రా, షికా గోయల్, చారు సిన్హా, రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement