
'గ్రేటర్' ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది: డీజీపీ
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదైందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రారంభం నుంచి ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీజీపీ మీడియాకు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనకసాగుతుందన్న విషయం అందరికీ విదితమే.