గ్రేటర్ పోలింగ్ ప్రారంభం
- ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
- సాయంత్రం 5 గం. వరకు కొనసాగనున్న ప్రక్రియ
- 150 డివిజన్లలో పోటీపడుతున్న 1,333 మంది అభ్యర్థులు
- మొత్తం 74 లక్షల ఓటర్లు.. 7,802 పోలింగ్ కేంద్రాలు
- తొలిసారి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్
- జట్టుకట్టిన టీడీపీ-బీజేపీ.. ఒంటరిగా కాంగ్రెస్, ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్:
గ్రేటర్ యుద్ధం కీలక ఘట్టానికి చేరింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నాడు. పెరిగిన సాంకేతికతతో తమ పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితాలో వరుస సంఖ్య వంటివి వెబ్‌సైట్ ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నవారు దాదాపు పది లక్షల మంది ఉండటం ఎన్నికలపై ఉత్సాహాన్ని చూపుతోంది. ఇంటింటికీ ఇప్పటికే ఓటరు స్లిప్‌లు అందజేశారు. మొత్తం 74 లక్షల ఓటర్లకుగాను దాదాపు 80 శాతం మందికి తమ పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసు. ఇంకా ఓటరుస్లిప్‌లు అందని వారికి మంగళవారం కూడా వాటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.
గతంలో పాలక మండలిలో మేయర్లుగా పనిచేసిన వారు సైతం ఈసారి కార్పొరేటర్‌గా పోటీ చేస్తుండటం విశేషం. అలాగే ఇంతకుముందు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఫ్లోర్ లీడర్లుగా వ్యవహరించిన నేతలు ప్రస్తుతం అధికార పార్టీలో చేరి పోటీకి దిగడం గమనార్హం. గత పాలక మండలి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు కాగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదవీకాలం ముగిసింది. గత ఎన్నికల్లో పోటీయే చేయని టీఆర్‌ఎస్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 వార్డుల నుంచి బరిలోకి దిగింది. టీడీపీ-బీజేపీ కూటమిగా రంగంలో ఉన్నా.. పదికిపైగా స్థానాల్లో రెండు పార్టీల అభ్యర్థులు తలపడుతున్నారు. ఎంఐఎం 60 స్థానాల్లో పోటీ చేస్తోంది. మొత్తం అభ్యర్థుల్లో దాదాపు సగం మంది ఇండిపెండెంట్లు ఉండడం గమనార్హం.
ఏ పార్టీ.. ఎన్ని వార్డుల్లో పోటీ?
పార్టీ వార్డులు
టీఆర్‌ఎస్ 150
టీడీపీ 95
కాంగ్రెస్ 149
బీజేపీ 66
ఎంఐఎం 60
బీఎస్పీ 55
సీపీఐ 21
సీపీఎం 22
లోక్‌సత్తా 26
ఇండిపెండెంట్లు 640
జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం: 625 చ.కి.మీ.
మొత్తం ఓటర్లు: 74,23,980
పురుషులు : 39,69, 007
మహిళలు: 34,53,910
ఇతరులు: 1,163
వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు ఇలా..
మొత్తం వార్డులు : 150
ఎస్టీ జనరల్: 1
ఎస్టీ మహిళ: 1
ఎస్సీ జనరల్: 5
ఎస్సీ మహిళ: 5
బీసీ జనరల్: 25
బీసీ మహిళ: 25
మహిళ జనరల్ : 44
అన్ రిజర్వుడు (ఓపెన్): 44
- మొత్తం పోలింగ్ కేంద్రాలు: 7,802
- 500 కంటే తక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు: 165
- 500 నుంచి 1,000 లోపు ఓటర్లున్న కేంద్రాలు: 4,752
- 1,000 నుంచి 1,250 మంది ఓటర్లున్న కేంద్రాలు: 2,318
-1,250 కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న కేంద్రాలు: 522
- ఉప పోలింగ్ కేంద్రాలు: 45
- సున్నితమైన పోలింగ్ కేంద్రాలు: 1,987
- అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు: 867
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 382
- అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 36
- ఎన్నికల విధుల్లో పోలింగ్ సిబ్బంది: 46,545
- మైక్రో అబ్జర్వర్లు: 1,500
- వెబ్ కెమెరాలు: 3 వేలు
- రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు: 24
గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
- పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలి
- 6 నుంచి 6.15 గంటల వరకు మాక్ పోలింగ్ జరుగుతుంది
- 6.55 గంటలకు ఈవీఎంలకు తిరిగి సీల్ వేస్తారు
- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అప్పట్లోగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు.
- ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిచేసేందుకు నిపుణులు అందుబాటులో ఉంటారు. సరి చేయలేని పక్షంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. రిజర్వులో తగినన్ని ఈవీఎంలున్నాయి.
- ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు
- అంధులు ఎవరి సాయం లేకుండా ఓటేసేందుకు బ్రెయిలీ లిపితో కూడిన బ్యాలెట్ సదుపాయం
- ఇప్పటివరకు రూ.2.58 కోట్ల డబ్బు, రూ.లక్ష విలువైన అక్రమ మద్యం స్వాధీనం
జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు సెలవు
గ్రేటర్ ఎన్నికల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం సెలవు దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, షాపులు, ఇతర వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది. సెలవు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఓటింగ్‌లో పాలుపంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మొత్తం పోలింగ్ కేంద్రాలు 7,802
500 కంటే తక్కువ ఓటర్లున్నవి 165
500 నుంచి 1,000 లోపు ఓటర్లున్నవి 4,752
1,000 నుంచి 1,250 మంది ఓటర్లున్నవి 2,318
1,250 కన్నా ఎక్కువ మంది ఓటర్లున్నవి 522
సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 1,987
అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 867
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 382
అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 36
ఎన్నికల విధుల్లో పోలింగ్ సిబ్బంది 46,545
మైక్రో అబ్జర్వర్లు 1,500
వెబ్ కెమెరాలు 3000
రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు,
స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు 24