
ఆకతాయిలపై కఠిన చర్యలకు కొత్త చట్టం
మహిళలను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు.
తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కనీసం 10 వేల నుంచి 15 వేల అపరాధ రుసుము, జైలు శిక్ష ప్రతిపాదించినట్లు తెలిపారు. మహిళల రక్షణ, వారి హక్కులు కాపాడేందుకు పలు చట్టాలు అమలు అవుతున్నాయని, వాటిపై చదువుకున్నవారికి కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా అన్నారు. మొత్తం పోలీసుల్లో మహిళలు 5 శాతం కంటే తక్కువగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. వరకట్న వ్యతిరేక చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే అని డీజీపీ అన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్‌పర్సన్ కామినీ షరాఫ్ తదితరులు పాల్గొన్నారు.