'నాపై దాడి కేసును పునర్విచారించండి'
హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మను మంగళవారం కలిశారు. తనపై జరిగిన దాడి కేసును మరోసారి విచారించాలని గద్దర్ కోరారు. 1997, ఏప్రిల్ 6 న గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో మూడు బుల్లెట్లు గద్దర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. డాక్టర్లు మూడు బుల్లెట్లలో రెండింటిని బయటికి తీశారు. మూడవ బుల్లెట్ తీయడానికి వీలుపడకపోవడంతో శరీరంలో ఉండిపోయింది. ఈ కేసు విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన గద్దర్ మరోసారి విచారణ చేపట్టాల్సిందిగా డీజీపీని కోరారు.