⇒ మరో 48 ఔట్ పోస్టుల ఏర్పాటు
⇒ మెట్రో రైలు భద్రతపై సమీక్షలో డీజీపీకి ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రక్షణకు మెట్రో కారిడార్ వెంబడి 5 ‘ఏ- కేటగిరీ’, 12 ‘బీ- కేటగిరీ’ పోలీస్‌స్టేషన్లతో సహా 48 పోలీసు ఔట్ పోస్టులను నిర్మించాలని ప్రతిపాదనలు అందాయి. మెట్రో భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో రైల్వేలు, రోడ్డు భద్రత విభాగం అదనపు డీజీ కృష్ణ ప్రసాద్ ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు.
మెట్రో ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఓ నివేదికను అందజేశారు. మెట్రో భద్రతకు సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మెట్రో రైలు ఎండీ ఎంవీఎస్ రెడ్డి, నగర సీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీలు అంజనికుమార్, సందీప్ శాండిల్య, సైబరాబాద్, రాచకొండ సీపీలు మహేశ్ భగవత్, నవీన్ చంద్, ఇంటెలిజెన్స్ ఐజీ శివానంద్ నింబర్గ్ తదితరులు పాల్గొన్నారు.
మెట్రో రైలు కు 17 కొత్త పోలీసు స్టేషన్లు
Published Wed, Oct 26 2016 3:33 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement