ప్రాజెక్టులకు పోలీసు పహారా | The project is being guarded by the police | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు పోలీసు పహారా

Published Sun, Mar 20 2016 5:58 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

ప్రాజెక్టులకు పోలీసు పహారా - Sakshi

ప్రాజెక్టులకు పోలీసు పహారా

♦ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీస్‌స్టేషన్
♦ స్థలాన్ని పరిశీలించిన డీజీపీ అనురాగ్‌శర్మ
♦ మావోయిస్టుల ప్రభావం లేకుండా చర్యలు
 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం కొత్త వాటి నిర్మాణం విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గోదావరి నదీ తీరం వెంట నిర్మించబోయే ప్రాజెక్టులకు మావోయిస్టుల నుంచి ఇబ్బంది లేకుండా చేసేందుకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం తుపాకులగూడెం ప్రాంతంలో అటాకింగ్ పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు. పోలీసు రాష్ట్ర ఉన్నతాధికారి(డీజీపీ) అనురాగ్‌శర్మ ఈ ప్రాంతాన్ని శనివారం పరి శీలించారు.

పోలీస్ అటాకింగ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలం ఐదు ఎకరాలను గుర్తిం చారు. తుపాకులగూడెం, దేవాదుల, గుట్టలగంగారం ప్రాంతాల్లో 72 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై రెండు ఎకరాల స్థలంలో అటాకింగ్ పోలీస్‌స్టేషన్ కోసం రెండు అంతస్తుల భవనం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గోదావరి నది ఆనుకుని ఉన్న గ్రామాల మీదుగా జాతీయ రహదారిని నిర్మిం చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంట్లో భాగంగా భద్రాచలం నుంచి ఏటూరునాగారం, తుపాకులగూడెం, దేవాదుల గ్రామాలను తాకుతూ ఈ రహదారిని కరీంనగర్ జిల్లాకు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

భద్రాచలం నుంచి కౌటాల వరకు 380 కిలోమీటర్ల జాతీయ రహదారికి ప్రతిపాదిత పోలీస్ అటాకింగ్ స్టేషన్ ప్రాంతం కేంద్ర బిందుగా మారనుంది. ఏటూరునాగారం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం ఇంటేక్‌వెల్ నిర్మించారు. దేవాదుల ప్రాజెక్టు దిగువ భాగంలో తుపాకులగూడెం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు భీరమయ్య గుట్ట మధ్య గోదావరి నదిపై రూ.3 వేల కోట్లతో బ్యారేజీ పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉంటున్నాయి. గోదావరి నదిపై ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద నిర్మించిన బ్రిడ్జిపై రాకపోకలు పెరిగాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలోకి వచ్చి ఆశ్రయం పొందుతుంటారు. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు రక్షణ కల్పించాలంటే ఈ ప్రాంతంలో పోలీస్ అటాకింగ్ స్టేషన్ అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది.  

 మేడిగడ్డను సందర్శించిన డీజీపీ
 మహదేవపూర్ : కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని మేడిగడ్డ ప్రాంతం లో మావోరుుస్టు పార్టీ కదలికలున్నారుు. దీంతో పోలీసుశాఖ ముందస్తుగా చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి అంచనా వేసేందుకు డీజీపీ ఇక్కడికి వచ్చారు. గోదావరినది ఒడ్డు నుంచి అవతలి వైపున ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాన్ని బైనాక్యులర్ల ద్వారా పరిశీలించారు. సరిహద్దున ఉన్న గ్రామాలు, ఇతర వివరాల గురించి ఎస్పీ, ఓఎస్డీలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావ రి నదిపై బ్యారేజీలను నిర్మించనున్న నేపథ్యంలో.. వాటి రక్షణ ఏర్పాట్లు, ఇతర పనులను పరిశీలించేందుకే గోదావరి తీరం వెంట పర్యటించామని అనురాగ్‌శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement