రాష్ట్ర పోలీసుశాఖ కొత్త బాస్ ఎవరనే అంశానికి తెరపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా 1986 బ్యాచ్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీజీపీగా ఆయన నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.