
వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి
పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రిం చాలని.. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు.
డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రిం చాలని.. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు. హైదరాబా ద్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని అశ్విని అలర్జీ కేంద్రం తలపెట్టిన స్వచ్ఛ ఆకాశ్ అభియాన్ ప్రచారోద్యమాన్ని గురువారం డీజీపీ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని 20 ప్రధాన ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్థాయిలపై ఈ ఆస్పత్రి వైద్యులు జరిపిన అధ్యయన నివేదికను సైతం డీజీపీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగిందని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. అశ్వినీ అలర్జీ కేంద్రం వైద్యులు, ప్రముఖ ఆస్తమా నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ మెట్రో రైలు పనుల వల్ల నగరంలో వాయు కాలుష్యం పెరిగిందన్నారు.