డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ద్యావుడా సినిమా టైటిల్‌తో పాటు చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, ఆ సినిమాపై నిషేధం విధించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో శివుడు, వెంకటేశ్వర స్వామిని అభ్యంతకరంగా చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదలు చేశారని పరశురాం పరివార్ సంఘం సోమవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్‌లో సినిమా ట్రైలర్ వివాదాస్పదంగా ఉందని, పూర్తి సినిమా కూడా హిందు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటుందన్న ఆందోళన ఉందని, వెంటనే సినిమా డైరెక్టర్ దాసరి సాయిరామ్, నిర్మాత హరికుమార్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘం నాయకులు డీజీపీని కోరారు.
శివలింగంపై మద్యం, మాంసం, సిగరెట్లను అభిషేకంలాగా కుమ్మరిస్తూ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో ట్రైలర్‌ను తొలగించడంతోపాటు.. సినిమా విడుదలపై నిషేధం విధించాలని సంఘం అధ్యక్షుడు ఆత్మకూరి కిషోర్, తదితరులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఇప్పటికే తాము ఫిలిం చాంబర్స్, దేవాదాయ మంత్రికి, సీసీఎస్ సైబర్ క్రైమ్, సెన్సార్‌బోర్డుకు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు.
‘ద్యావుడా’ను ఆపేయండి
Published Tue, Jan 10 2017 3:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
Advertisement
Advertisement