Brahmin communities
-
ఐవైఆర్ కృష్ణా రావుపై అసభ్య పోస్టు..
-
ఐవైఆర్ కృష్ణా రావుపై అసభ్య పోస్టు..
► డీజీపీకి ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు విజయవాడ : తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్సైట్ లో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఫొటోను అసహ్యంగా పోస్టు చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిని ఇటువంటి పోస్టుల ద్వారా అవమానించడంపై తక్షణం పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పలువురు బ్రాహ్మణ ప్రతినిధులు విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఐజీ మీనాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని, కార్పోరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కృష్ణారావుపై వచ్చిన పోస్టులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 48 గంటల్లో ఈ అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఐజీ మీనాను కలిసిన వారిలో బ్రాహ్మణ సంఘాల నేతలు యేలేశ్వరపు జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ద్రోణంరాజు రవికుమార్, జింకా చక్రధర్ తదితరులు వున్నారు. -
కలెక్టర్‌పై బ్రాహ్మణ సంఘాలు గరంగరం
హైదరాబాద్: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మణ సంఘాల నేతలు డీజీపీని కలవనున్నారు. క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బ్రహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మణ సంఘం నేతలు ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు డీజీపీని కలవనున్నారు. ఎస్సీ, ఎస్టీలు పెద్ద మాంసం తినేవాళ్లు.. మధ్యలో దరిద్రపు బ్రాహ్మణ కల్చర్ వచ్చి పెద్ద మాంసం బంద్ చేయించిందంటూ నోరు జారారు. కాగా, తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. టీబీ లాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం(పంది, గొడ్డు మాంసం) తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు అనే పదాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. -
‘ద్యావుడా’ను ఆపేయండి
డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు సాక్షి, హైదరాబాద్: ద్యావుడా సినిమా టైటిల్‌తో పాటు చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, ఆ సినిమాపై నిషేధం విధించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో శివుడు, వెంకటేశ్వర స్వామిని అభ్యంతకరంగా చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదలు చేశారని పరశురాం పరివార్ సంఘం సోమవారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్‌లో సినిమా ట్రైలర్ వివాదాస్పదంగా ఉందని, పూర్తి సినిమా కూడా హిందు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటుందన్న ఆందోళన ఉందని, వెంటనే సినిమా డైరెక్టర్ దాసరి సాయిరామ్, నిర్మాత హరికుమార్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘం నాయకులు డీజీపీని కోరారు. శివలింగంపై మద్యం, మాంసం, సిగరెట్లను అభిషేకంలాగా కుమ్మరిస్తూ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో ట్రైలర్‌ను తొలగించడంతోపాటు.. సినిమా విడుదలపై నిషేధం విధించాలని సంఘం అధ్యక్షుడు ఆత్మకూరి కిషోర్, తదితరులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఇప్పటికే తాము ఫిలిం చాంబర్స్, దేవాదాయ మంత్రికి, సీసీఎస్ సైబర్ క్రైమ్, సెన్సార్‌బోర్డుకు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. -
ఆశీర్వదించాల్సిన చేతులు యాచిస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను ఆశీర్వదించాల్సిన బ్రాహ్మణుల చేతులు యాచించే స్థాయికి చేరాయని, అధికారం ఉంటేనే ఆశీర్వదించే అవకాశం ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, నమస్తే తెలంగాణా దినపత్రిక అధిపతి సి.లక్ష్మీరాజం అన్నారు. బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల మైదానంలో బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో ఆయన స్వాగతోసన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2న నిర్వహించే అర్చక శంఖారావం కరపత్రాన్ని ఆయన మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీరాజం మాట్లాడుతూ రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా బ్రాహ్మణుల సంఖ్య కేవలం నాలుగుకే పరిమితమైందని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు అసెంబ్లీ, ఒక రాజ్యసభ స్థానాన్ని బ్రాహ్మణులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన ట్లే అన్నిపార్టీలు కూడా బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాతినిధ్యం కల్పించని పార్టీలకు బ్రాహ్మణులు సంఘటితంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల అనైక్యత వల్లనే ప్రభుత్వం దివంగత పీవీ నరసింహారావును భారతరత్న పురస్కారంతో గౌరవించలేదన్నారు. ఆత్మగౌరవసభ విజయవంతం కాలేదని నిరాశ చెందవద్దని, కొద్ది నెలల్లోనే మరోమారు ఇదే మైదానంలో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... రాబోయే ప్రభుత్వంలో అర్చకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. గౌరవ అతిధిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... బ్రాహ్మణులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరముందని చెప్పారు. బాహ్మణుల సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు 2014 ఎన్నికలను వేదికగా చేసుకోవాలని టీటీడీ పూర్వ కార్యనిర్వహణాధికారి కె.వి.రమణాచారి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ డీజీపీ అరవిందరావు సూచించారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా సాగాలని వైఎస్సార్సీపీ నేత జనక్‌ప్రసాద్ సూచించారు. తన తండ్రి పీవీ నరసింహారావు క్లిష్టపరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపినా కాంగ్రెస్ పార్టీ ఆయనను అగౌరవపరుస్తోందని మాజీ ఎంపీ పీవీ రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సి.విజయ లక్ష్మీరాజం, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, సుదీష్ రాంభొట్ల, సుమలత శర్మ, వెల్లాల రామ్మోహన్, సుధాకర్ శర్మలతోపాటు వివిధ పార్టీల నుంచి నగరంలోని అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.