కలెక్టర్‌పై బ్రాహ్మణ సంఘాలు గరంగరం
Published Sat, Mar 25 2017 12:32 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
హైదరాబాద్: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మణ సంఘాల నేతలు డీజీపీని కలవనున్నారు. క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బ్రహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మణ సంఘం నేతలు ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు డీజీపీని కలవనున్నారు.
ఎస్సీ, ఎస్టీలు పెద్ద మాంసం తినేవాళ్లు.. మధ్యలో దరిద్రపు బ్రాహ్మణ కల్చర్ వచ్చి పెద్ద మాంసం బంద్ చేయించిందంటూ నోరు జారారు. కాగా, తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. టీబీ లాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం(పంది, గొడ్డు మాంసం) తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు అనే పదాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.
Advertisement