వల్లభనేని వంశీ ఫిర్యాదుపై నాకేమి తెలియదు | I Don't Know Vallabhaneni Vamsi complaint says IG Sitaramanjaneyulu | Sakshi
Sakshi News home page

వల్లభనేని వంశీ ఫిర్యాదుపై నాకేమి తెలియదు

Published Tue, Jan 21 2014 9:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

వల్లభనేని వంశీ ఫిర్యాదుపై నాకేమి తెలియదు

వల్లభనేని వంశీ ఫిర్యాదుపై నాకేమి తెలియదు

హైదరాబాద్ : టీడీపీ నేత వల్లభనేని వంశీ ఫిర్యాదుపై తనకేమీ తెలియదని గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు తెలిపారు. దానిపై మాట్లాడటానికి ఏమీలేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. గతంలో  విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సీతారామాంజనేయులు ....వల్లభనేని వంశీల మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. అనంతరం బదిలీపై సీతారామాంజనేయులు హైదరాబాద్ వచ్చేశారు.

కాగా సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ  వల్లభనేని వంశీ డీజీపీ ఫిర్యాదు చేశారు. మజీ నక్సల్స్‌తో చంపించాలని ఐజీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు భద్రత కల్పించి ప్రాణాలను కాపాడాలని డీజీపీ ప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు. అలాగే విజయవాడ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ అపాయింట్‌మెంట్ కూడా వంశీ కోరినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement