vijayawada sp
-
సారా కాయబోమని స్వచ్చందంగా 120 కటుంబాలు...
సాక్షి, విజయవాడ: నిడమర్రు గ్రామ పంచాయతీలోని నాలుగు గ్రామాల సారా తయారి దారులు ఇకపై నాటుసారా తయారీ జోలికి వెళ్లబోమని స్వచ్చందంగా ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో 120 కుటుంబాలు సారా తయారికి వాడే బట్టీ సామాగ్రిని గురువారం జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. సారా తయారికి 120 కుటుంబాలు స్వస్తి పలకడం ఆనందంగా ఉందన్నారు. వీరంత నాటు సారా జోలికెళ్లమని చెప్పడం శుభ పరిణామని వ్యాఖ్యానించారు. కాగా సారా తయారుదారుల్లో మార్పు తెచ్చిన పోలీసులకు స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. (అక్రమ మద్యంపై ‘ఎస్ఈబీ’ లాఠీ) -
వల్లభనేని వంశీ ఫిర్యాదుపై నాకేమి తెలియదు
హైదరాబాద్ : టీడీపీ నేత వల్లభనేని వంశీ ఫిర్యాదుపై తనకేమీ తెలియదని గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు తెలిపారు. దానిపై మాట్లాడటానికి ఏమీలేదని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సీతారామాంజనేయులు ....వల్లభనేని వంశీల మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. అనంతరం బదిలీపై సీతారామాంజనేయులు హైదరాబాద్ వచ్చేశారు. కాగా సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ డీజీపీ ఫిర్యాదు చేశారు. మజీ నక్సల్స్‌తో చంపించాలని ఐజీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు భద్రత కల్పించి ప్రాణాలను కాపాడాలని డీజీపీ ప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు. అలాగే విజయవాడ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ అపాయింట్మెంట్ కూడా వంశీ కోరినట్లు సమాచారం.