![Vijayawada SP M Ravindranath Babu Talks In Press Meet Over Natusara - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/21/SP-M-Ravindranath-Babu.jpg.webp?itok=DdDeYs9U)
సాక్షి, విజయవాడ: నిడమర్రు గ్రామ పంచాయతీలోని నాలుగు గ్రామాల సారా తయారి దారులు ఇకపై నాటుసారా తయారీ జోలికి వెళ్లబోమని స్వచ్చందంగా ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో 120 కుటుంబాలు సారా తయారికి వాడే బట్టీ సామాగ్రిని గురువారం జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. సారా తయారికి 120 కుటుంబాలు స్వస్తి పలకడం ఆనందంగా ఉందన్నారు. వీరంత నాటు సారా జోలికెళ్లమని చెప్పడం శుభ పరిణామని వ్యాఖ్యానించారు. కాగా సారా తయారుదారుల్లో మార్పు తెచ్చిన పోలీసులకు స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. (అక్రమ మద్యంపై ‘ఎస్‌ఈబీ’ లాఠీ)
Comments
Please login to add a commentAdd a comment