కేసులన్నీ ఆన్‌లైన్‌! | All cases into the online | Sakshi
Sakshi News home page

కేసులన్నీ ఆన్‌లైన్‌!

Published Wed, Mar 29 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

కేసులన్నీ ఆన్‌లైన్‌!

కేసులన్నీ ఆన్‌లైన్‌!

ఫిర్యాదులు, కేసుల స్థితిపై ఫిర్యాదుదారుల సెల్‌ఫోన్‌కు సందేశాలు
సీసీటీఎన్‌ఎస్‌ గోలైవ్‌ ప్రాజెక్టుతో టెక్నాలజీ పోలీసింగ్‌


సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖ ప్రజలకు మరింత చేరువయ్యేలా, ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా.. రాష్ట్ర పోలీస్‌ శాఖ ‘సీసీటీఎన్‌ఎస్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్నాళ్లూ ఫిర్యాదులు, కేసుల పరిస్థితి ఏ స్థితిలో ఉందనేది తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది.  దీనికి ‘సీసీటీఎన్‌ఎస్‌’ ద్వారా పరిష్కారం లభించనుంది.

ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్‌లు
ఎవరైనా ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే పిటిషన్‌ నంబర్, తదితర వివరాలతో ఫిర్యాదుదారు సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ అందుతుంది. 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ కాపీతో సహా ఫిర్యాదుదారుల ఈ– మెయి ల్‌ ఐడీకి, మొబైల్‌కు పంపించనున్నారు. ఇక ‘సీసీటీ ఎన్‌ఎస్‌’లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి డీజీపీ కార్యాలయంలోని పీసీఎస్‌ (పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీస్‌) సర్వర్లకు ప్రతి పిటిషన్‌ కాపీ, ఎఫ్‌ఐఆర్‌ కాపీ, సీడీ (కేస్‌ డైరీ) తదితర 14 రకాల కాపీలను అప్‌లోడ్‌ చేస్తారు. నిత్యం వచ్చే పిటిషన్లు, నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీలన్నింటినీ సీసీటీఎన్‌ఎస్‌ (ఈ–కాప్స్‌)ద్వారా పంపిస్తారు. దీంతో రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌లో ఏకేసు నమోదైంది, దాని పరిస్థితేమిటన్న అంశాలను డీజీపీ సహా అన్ని ర్యాంకుల్లోని అధికారులు తెలుసుకోవచ్చు.

డీఎస్‌ఆర్‌ సైతం ఆన్‌లైన్‌లోనే..
రోజూ పోలీస్‌స్టేషన్ల నుంచి ఎస్పీలకు, ఎస్పీల నుంచి డీజీపీకి డీఎస్‌ఆర్‌ (డైలీ సిచ్యువేషన్‌ రిపోర్ట్‌)లను పంపిస్తారు. ప్రస్తుతం వీటిని పోస్టు రూపంలో పంపు తున్నారు. ఇక నుంచి నేరుగా సీసీటీఎన్‌ఎస్‌ కింద ప్రతి అధికారికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అందజేస్తా రు. నేరుగా సంబంధిత అధికారి యూజర్‌ ఐడీకి డీఎస్‌ఆర్‌ వచ్చేస్తుంది. సీసీటీఎన్‌ఎస్‌ (ఈ–కాప్స్‌) ద్వారా సంబంధిత అధికారి తన మొబైల్‌ ఫోన్‌లోని అప్లికేషన్‌ ద్వారా డీఎస్‌ఆర్, కేసుల స్థితి, దర్యాప్తు పరిస్థితులను పరిశీలించవచ్చు.

2002 నుంచి ప్రతీ ఎఫ్‌ఐఆర్‌
2002 నుంచి 2017 మార్చి 28 వరకు అన్ని ఎఫ్‌ఐఆర్‌ కాపీలతో పాటు కేసు ఏ దశలో ఉందన్న అంశాలను పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. నేరుగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా నేరస్తుల ట్రాకింగ్‌
ఒక రాష్ట్రంలో అరెస్టైన నేరగాళ్ల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు పంచుకోవచ్చు. అంతేకాదు ఒక వ్యక్తి పేరు సీసీటీఎన్‌ఎస్‌ ఈ–కాప్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో టైప్‌ చేసి, సెర్చ్‌ చేస్తే అతడిపై ఉన్న మొత్తం కేసుల చిట్టా బయటకు వస్తుంది.

15 వేల పోలీస్‌స్టేషన్ల డేటా
దేశవ్యాప్తంగా 2 వేల కోట్లతో ప్రారంభించిన సీసీటీ ఎన్‌ఎస్‌ ప్రాజెక్టులో 15 వేల పోలీస్‌స్టేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా డేటా అప్‌లోడ్, షేరింగ్‌ చేస్తున్నాయి. 6 వేల మంది పోలీసు అధికారులు ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో రూ.61 కోట్లతో పనులు చేపట్టారు. 4 క్రితం ప్రారంభమైన ఈ సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన సోమ వారం నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement