'పక్కా సమాచారంతోనే స్కెచ్' | DGP Anurag Sharma comments shadnagar encounetr | Sakshi
Sakshi News home page

'పక్కా సమాచారంతోనే స్కెచ్'

Published Mon, Aug 8 2016 11:35 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

'పక్కా సమాచారంతోనే స్కెచ్' - Sakshi

'పక్కా సమాచారంతోనే స్కెచ్'

హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్ మెన్ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది.

అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement