shadnagar encounter
-
కోర్టులో లొంగిపోయిన ఫహీం
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీం, అతడి భార్య షహీమ్ శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వారిద్దరికీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఫహీం పేరు మీద కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఫహీం ఏ2గా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఫహీం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ తరఫున ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. అయితే నయీం అక్రమాల చిట్టా వివరాలు తనకేమీ తెలియదని ఫహీం చెప్పడం గమనార్హం. మరోవైపు ఫహీంను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. కాగా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫహీం సెటిల్మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫహీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. శ్రీధర్, బలరాంను నిన్న హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. -
వంట మనిషి కాదు.. నయీమ్ నీడ
-
వంట మనిషి కాదు.. నయీమ్ నీడ
* ఫర్హానాకు తెలియకుండా చిల్లిగవ్వ కూడా లావాదేవీ జరిగేది కాదు * గోవాలోని నయీమ్ గెస్ట్‌హౌస్ కూడా ఫర్హానా పేరిటే రిజిస్ట్రేషన్ * కోకోనట్ అని ఫర్హానాను ముద్దుగా పిలుచుకునే గ్యాంగ్‌స్టర్ * పోలీసుల విచారణలో వెల్లడించిన వాచ్‌మన్ తాజుద్దీన్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. నెక్నాంపూర్‌లోని అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నానని చెప్పిన ఫర్హానా(30) సాధారణ మహిళ కాదట. నయీం ప్రతి కదలిక వెనుకా ఆమె పాత్ర ఉందట. ఇంట్లో పనులు మాత్రమే చేస్తానని చెప్పిన ఈమె పేరు మీద గోవా పాండా ఠాణా పరిధిలోని పొండబొరిన్ ప్లాట్ నంబర్ 274లోని నయీం గెస్ట్‌హౌస్‌గా చెప్పుకుంటున్న ఇల్లు రిజిస్టరై ఉందని వెల్లడైంది. నార్సింగ్ పోలీసులకు పట్టుబడిన గోవాలో నయీం గెస్ట్‌హౌస్‌లో వాచ్‌మన్ తాజుద్దీన్ పోలీసు విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టడు. దీంతో ఆమె పాత్రపై లోతుగా అధ్యయనం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తాజుద్దీన్.. గోవాలో నయీం నేర కార్యకలాపాలు బాగానే జరుగుతుండేవని పోలీసులకు తెలిపాడు. పుప్పాలగూడ పంచాయతీ పరిధిలోని అంజలిగార్డెన్లోనూ ఫర్హానాకు ఏడాది క్రితం నయీమ్ ఇల్లు కొనిచ్చాడని తెలిసింది. రెండు రోజుల క్రితమే ఈ ఇంట్లో పోలీసులు సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వినోదం, లావాదేవీలకు అడ్డాగా.. భార్య హసీనా బేగమ్తో ఆడపాదడపా నయీమ్ గోవాకు వెళ్లేవాడు. అయితే ఎక్కువసార్లు ఫర్హానాతోనే వెళుతుండేవాడు. అలాగే సదా, కరీనా, జేబ, ఇతర అమ్మాయిలనూ అక్కడకు తీసుకెళ్లేవాడు. గోవా నుంచే డబ్బు లావాదేవీలు భారీ మొత్తంలో సాగేవి. భూ సెటిల్మెంట్లకు సంబంధించిన విషయాల మీద కూడా భారీగానే చర్చించేవారు. చాలా మంది అమ్మాయిలతో నయీమ్ గెస్ట్‌హౌస్‌లో ఎంజాయ్ చేసేవాడు. ఫర్హానాను నయీమ్ ముద్దుగా కోకొనట్ అని పిలిచేవాడు. నయీమ్ ప్రతి ఆర్థిక లావాదేవీనీ ఈమె పర్యవేక్షిస్తుండేది. నయీమ్ ఆదేశాల ప్రకారం కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుని తాజుద్దీన్ నయీంకు అందజేసేవాడు. నయీమ్ ఉపయోగించే ఫోన్లు, సిమ్‌లు బాక్స్‌లో పెట్టుకునేవాడు. తన రూమ్, ఏఏ గదుల్లో డబ్బులు ఉంచాననే సీక్రెట్ లాంగ్వేజ్‌తో ఓ మ్యాప్‌ను రెడీ చేసి హాల్లో అంటించిపెట్టేవాడు. గోవాకు వచ్చినప్పుడల్లా పల్సర్ టీవీఎస్ స్కూటీ పెప్ బైక్‌లపై చక్కర్లు కొట్టేవాడు. గోవాలోని నయీం బెడ్రూమ్లో డబ్బు, భూ డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులు భద్రపరుచుకునేవాడు. అయితే ఇటీవల గోవాలోనే చర్చ్‌కు సమీపంలోని చర్చ్హౌస్గా పిలిచే మరో ఇంటిని నయీమ్ కొనుగోలు చేశాడు. అయితే ఏపీ, తెలంగాణలోని భూ దందాలకు సంబంధించిన సెటిల్మెంట్లను అక్కడి నుంచి చేసేవాడని తెలుస్తోంది. ఎవరీ తాజుద్దీన్..? నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని అబ్బాసియా కాలనీ మహమ్మద్ తాజుద్దీన్ స్వస్థలం. తాజుద్దీన్ పసితనంలోనే సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన తండ్రి కన్నుమూశాడు. ఆ తర్వాత నల్లగొండలోని తాత ఇంటికి అతని కుటుంబం వెళ్లింది. అక్కడే పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత పంక్చర్ షాప్ మొదలెట్టాడు. 1990లో మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ బేగమ్‌ను పెళ్లాడాడు. తర్వాత హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌కు మకాం మార్చాడు. కొన్నిరోజులు ఇక్కడా పంక్చర్ దుకాణం నిర్వహించి గిట్టుబాటు కాక తుక్కుగూడలోని ఓ కంపెనీలో వాచ్‌మన్‌గా చేరాడు. నల్లగొండకు చెందిన అఫ్రోజ్‌తో కూతురు బేగమ్‌కు పెళ్లి చేసే సమయంలో కొంత మంది నుంచి అప్పు తెచ్చాడు. ఈ సమయంలో దూరపు బంధువు నయీమ్‌ను కలసి డబ్బులు సర్దాలని కోరాడు. రూ.30 వేల అప్పు ఇచ్చిన నయీం.. గోవాలోని తన గెస్ట్ హౌస్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేయాలని కోరాడు. ఇందుకు నెలవారీగా జీతం ఇస్తానన్నాడు. దీంతో చంపాపేటలోని అత్తమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉంచి తాజుద్దీన్ 2012లో గోవాకు వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడ తాజుద్దీన్ పనిచేస్తున్నాడు. ఇలా పట్టుబడ్డాడు.. పోలీసులు నయీమ్‌ను ఎన్కౌంటర్ చేశారని తెలియడంతో భయపడిన తాజుద్దీన్ జీఏ-07-కే-0756 మహేంద్ర బొలెరో వాహనంలో నయీమ్ బెడ్రూమ్లో నగదుతో ఉన్న ఓ బ్యాగ్ తీసుకుని, ఈ నెల 11న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పుప్పలగూడ చేరుకున్నాడు. గోవా నంబర్ ప్లేట్ గల వాహనం వస్తోందని పోలీసులకు సమాచారం అందగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో తాజుద్దీన్ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా అన్ని లావాదేవీల్లో ఫర్హానా(ఏ1)ది కీలక పాత్ర అని, గోవా గెస్ట్‌హౌస్ ఆమె పేరు మీదనే ఉందని తెలిపాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ కేసు డైరీలో పేర్కొన్నారు. తాజుద్దీన్ నుంచి రూ.4,30,000 నగదు, మహేంద్ర బొలెరో వెహికల్, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించింది. నయీమ్ అల్లుడా మజాకా.. నయీమే కాదు భూ దందాల్లో వారి బంధువులూ ఉన్నట్టు తెలుస్తోంది. రోజురోజుకీ సెటిల్మెంట్ల లిస్టు పెరుగుతుండటంతో ఆ బాధ్యతల్ని తనకు నమ్మకమైన బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని నయీమ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ అల్లుడు ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫయీం సెటిల్మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫయీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే శ్రీధర్, బలరాంను హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న ఆరుగురి గురించి ముమ్మరంగా గాలిస్తున్నారు. -
మరో నయీంను సృష్టిస్తారా?
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్లను చంపాక, పౌర హక్కుల వాళ్ల మీద, పోలీసులూ, రాజకీయ నాయకుల మీదా పడ్డాడు నయీం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వ్యవస్థలను సృష్టించిన ఘనత మన ప్రభుత్వాలది, పోలీసు పెద్దలదే. నయీంలను సృష్టించి, ఏకు మేకు అయ్యే దాకా చూసి, మట్టుబెట్టడం ఎందుకు? ఈ ప్రశ్న మన పోలీసు పెద్దలు వేసుకోవాలి. మాకే సంబంధమూ లేదని కొట్టిపారేయొచ్చు. కానీ ఫియర్ వికాస్ నుంచి గ్రీన్టైగర్ల దాకా గత 30 ఏళ్లుగా పోలీసు పెద్దల మద్దతుతోనే నయీంలాంటి వాళ్లు బలపడి సమాజాన్ని పీడిస్తున్నారు. గ్రేహౌండ్స్ అనే ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటుకు వ్యూహకర్తయైన కేఎస్ వ్యాస్‌ను హత్య చేసిన అప్పటి నక్సలైట్ నయీముద్దీన్ 23 ఏళ్ల తరువాత అదే గ్రేహౌండ్స్ చేతుల్లో మొన్న హతం అయ్యాడు. ప్రజలకూ, పౌరహక్కుల కార్యకర్తలకూ, తీవ్రవాద ఉద్యమానికీ తలనొప్పిగా మారిన నయీం లాంటి వారు తమకు కూడా తలనొప్పి తెప్పిస్తుంటే తప్ప మన ప్రభుత్వాలు వారిని ఈ లోకం నుంచి తప్పించవు. అందుకు నయీం ఒక్కడే కాదు చాలా ఉదాహరణలున్నాయి. ఉపయోగపడతాడు అనుకుంటే, వాడు ఎంత కరడుగట్టిన నేరస్తుడయినా రక్షణ వలయం ఏర్పాటు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా చిద్విలాసంగా చూస్తుం టారు. అక్రమంగా ఆస్తులూ, లెక్కలేనంత డబ్బు కూడగట్టుకోడానికి అనుమ తించడమే కాదు తమవంతు సాయం కూడా చేస్తుంటారు. ఒక పోలీసు అధికారిని హత్య చేసిన నేరానికి జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు నయీం వేలాది కోట్ల ఆస్తులను సంపాదించడానికి వెనక చాలా కథ ఉంది. నక్సలైట్ల అణచివేతకు అష్టావక్ర మార్గం ఈ దేశంలో తీవ్రవాద ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తూ వచ్చిన ప్రభుత్వాలు ఆ ఉద్యమాన్ని అదే పద్ధతిలో అణచివేయబోయి సాధ్యం కాక ఎన్నో వక్ర మార్గాలను ఎంచుకున్నాయి. ఆ ఉద్యమాల సైద్ధాం తిక పునాది ఎంత బలంగా ఉంది, ప్రజలపట్ల వారి నిబద్ధత ఎంత అనేవి ఇక్కడ చర్చనీయాంశాలు కావు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి విధుల్లోకి వచ్చే వ్యవస్థలు ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎంచుకున్న వక్రమార్గా లను గురించి మాట్లాడాలి. ఆ వక్రమార్గాలలోకెల్లా మరీ అష్టావక్ర మార్గం కోవర్ట్‌లు. కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి, సోమల నాయక్, గోవింద రెడ్డి, నయీం వంటి వాళ్లంతా ఈ వక్రబుద్ధికి పుట్టిన కుక్క మూతి పిందెలే. ఒక దశలో తీవ్రవాద ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న వీళ్లంతా ఆ తరువాత పోలీసుల చేతిలో పావులుగా మారి ఆ ఉద్యమకారు లను చంపడం, చంపడానికి సహకరించడంతో మొదలుపెట్టారు. ఆ తదుపరి పౌర హక్కుల నేతలనూ, కార్యకర్తలను మట్టుబెట్టడం, ప్రజలను హింసిం చడం, దౌర్జన్యాలు సాగించడంతో ఆగక రాజకీయ నాయకత్వాన్ని కూడా గుప్పిట పెట్టుకోడానికి వారు చెయ్యని ప్రయత్నం లేదు. నయీం కూడా అట్లా పెరిగిన వాడే. ఎందరో పోలీసు అధికారులు, మరెందరో రాజకీయ నాయకులూ నయీంతో స్నేహం చెయ్యడానికి తహతహలాడిన వారే. నయీం ఇచ్చిన నజరానాలను సంతోషంగా స్వీకరించిన వారే. సోమవారం నయీంను ఎన్కౌంటర్లో చంపేసిన తరువాత పోలీసుల సోదాల్లో చాలా విషయాలు బయటపడే ఆస్కారం గల డాక్యుమెంట్లు బోలెడు దొరికాయి. అవన్నిటినీ బహిరంగపరిస్తే సమాజంలోని చాలామంది పెద్ద మనుషుల బతుకులు బజారునపడటం ఖాయం. అందులో పోలీసులు, రాజకీయ నాయకులూ, వ్యాపారులూ ఇంకా ఎవరయినా ఉండొచ్చు. భస్మాసుర హస్తం సృష్టికర్తలు 1993 జనవరిలో హైదరాబాద్ ఫతెహ్ మైదాన్ స్టేడియంలో ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను హతమార్చిన తరువాత జైలుకు వెళ్ళిన నయీం... ఏడేళ్ల తరువాత పోలీసుల ఆశీస్సులతో బయటికి వచ్చి అదే స్టేడియం పక్కన ఉన్న బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పత్రికా గోష్టి నిర్వహించి తాను ఎవరెవరిని చంపబోతు న్నాడో హిట్ లిస్ట్ చదివి వినిపించాడు. తీవ్రవాద ఉద్యమాన్ని అంతం చేస్తాననీ, అవసరం అయితే ఆనాటి పీపుల్స్‌వార్ కేంద్ర కార్యదర్శి గణపతిని కూడా హతమారుస్తాననీ ప్రకటించాడు. ఆనాటి పోలీసు బాస్‌లకు ఇది నచ్చింది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసే పనిని నయీం వంటి వాళ్లకు అప్పగించి తాము నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇటువంటి వారు చివరికి తమ పాలిటి భస్మాసుర హస్తాలు అయ్యే ప్రమాదం ఉందని చెపితే విన్నారా? ‘‘ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని చిలక పలుకులు పలికే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మపన్నాలు వల్లించే పోలీ సులు, ప్రభుత్వ నేతలూ గమనించవలసిన విషయం ఒకటుంది. రేపు వీళ్లు (నయీం తదితరులు) నక్సలైట్లను చంపుతారు సరే తరువాత ఏమిటి? ఇలాంటి నేర ప్రపంచాన్ని పెంచి పోషిస్తున్న పోలీసులకూ ప్రభుత్వానికీ అది భస్మాసుర హస్తంగా మారకుండా ఎవరరుునా ఆపగలరా?’’అని ప్రజాతంత్ర వారపత్రికలో ( 2000 ఆగస్ట్‌లో) రాస్తే పోలీసు పెద్దలకు రుచించలేదు. ఒక పోలీసు అధికారిని నా దగ్గరకు పంపించి ‘‘మీకు అటువంటి సందేహం అక్కర లేదు. ఎక్కడికి పోతారు వీళ్లు, మా అవసరం తీరాక వీళ్లను అడ్డు తొలగించుకోవడం మా చేతిలో పని, అయినా నయీం దుర్మార్గుడు, వాడితో ఎందుకు పెట్టుకుంటారు అని నాకు ఒక ఉచిత సలహా కూడా చెప్పించారు. బెడిసి కొట్టే వరకు పోలీసు పహారా పదహారేళ్ల నాటి నా ప్రశ్నకు నయీం చేసిన దుర్మార్గాలే పెద్ద సమాధానం. నక్సలైట్లను చంపాక, పౌర హక్కుల వాళ్ల మీద, ఆ తరువాత పోలీసులూ, రాజకీయ నాయకుల మీదా పడ్డాడు నయీం. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వ్యవస్థలను కొన్నిటిని సృష్టించిన ఘనత కచ్చితంగా మన ప్రభుత్వా లది, పోలీసు పెద్దలదే. హత్యా నేరాలు మోస్తున్న కత్తుల సమ్మయ్యకు పాస్‌పోర్ట్, వీసాలూ ఇప్పించి దేశం దాటించ చూస్తే అతను కొలంబోలో విమాన ప్రమాదంలో చనిపోయాడు. లేకపోతే విదేశాల్లో ఎక్కడో హాయిగా స్థిరపడి ఉండేవాడు. అనుమానంతో అమాయకులను వేధించి ఒక్కోసారి వాళ్ల జీవితాలు నాశనం కావడానికి కూడా కారణం అయ్యే పోలీసులు కత్తుల సమ్మయ్య వంటి కరడుకట్టిన నేరస్తులను క్షేమంగా దేశం దాటించేస్తారు. ఎందుకంటే అతను నక్సలైట్లను చంపాడు. బయ్యపు సమ్మిరెడ్డి అనే మరో కోవర్ట్ సొంత గొడవల్లో హత్యకు గురయ్యాడు. గోవిందరెడ్డి, జడల నాగరాజు ఏమయ్యారు? చాలా కాలం జడల నాగరాజు కూడా మన పోలీసు పెద్దల ముద్దుల అతిథే. ఒకసారి సిద్ధిపేట దాబాల దగ్గర నిలబడి చాయ్ తాగుతుంటే ఆరు జీపుల నిండా సాయుధులు హైదరాబాద్ వైపు దూసుకు పోతూ కనిపించారు. ఎవరని ఆరా తీస్తే వాళ్లంతా మాజీ నక్సలైట్ జడల నాగరాజు సెక్యూరిటీ అని తెలిసింది. ముందు జీపులో ఉన్న అతనికి రక్షణగా ఈ బలగాలు. వారిలో కొందరు మఫ్టీలోని పోలీసులు. అవును మరి, నక్సలైట్ల శత్రువులను కాపాడటం మన పోలీసు వ్యవస్థ పనే కదా. నేరస్త ముఠాల కోసం లెక్కలు లేని నిధులు నయీముద్దీన్ వంటి నేరస్తుల జీవితాలకు ముగింపు ఇంతకంటే భిన్నంగా ఉండదు. అరుుతే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నయీంలను, కత్తుల సమ్మయ్య లనూ మనమే సృష్టించి, ఏకు మేకు అయ్యే దాకా చూసి, మనమే ఎందుకు మట్టుబెట్టడం? అని. ఈ ప్రశ్న మన పోలీసు పెద్దలు వేసుకోవాలి. మాకే సంబంధమూ లేదు, ఇదంతా గిట్టని వాళ్లు, పోలీసు వ్యతిరేకులూ, అభివృద్ధి నిరోధకులూ చేసే ఆరోపణ అని ప్రభుత్వం, పోలీసులు కొట్టి పారేయొచ్చు. 1986లో ఫియర్ వికాస్ నుంచి ఈనాటి గ్రీన్టైగర్ల దాకా ఈ 30 ఏళ్లలో పోలీసు పెద్దల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతోనే నయీం లాంటి వాళ్లు బలవం తులై సమాజాన్ని పీడిస్తున్నారు. వాళ్లు నక్సలైట్లను వ్యతిరేకిస్తారు, చంపు తారు కాబట్టి వాళ్లకు మా మద్దతు అన్నది పోలీసుల ధోరణి. 1986లో నాటి కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పత్రికా గోష్టిలో నాటి ఎస్పీ అశోక్ ప్రసాద్ సమక్షంలోనే ఫియర్ వికాస్ నాయకుడు, హుస్నాబాద్ వాస్తవ్యుడు అన్నెబోయిన మల్లయ్య ఆ సంస్థ ఆవిర్భావాన్ని, దాని లక్ష్యాలను వివరించాడు. అక్కడి నుంచి మొదలై జన రక్షణ సంస్థ, క్రాంతి సేన, గ్రీన్ టైగర్స్, రెడ్ టైగర్స్ వంటి అనేక సంస్థలు పోలీసుల ఆశీర్వాదంతోనే పుట్టాయి, ప్రజల ఆగ్రహానికి అంతరించాయి. ఇట్లాంటి వ్యక్తులు, సంస్థలను చేరదీసి, బలోపేతం చెయ్యడానికి లెక్కకురాని పోలీసు ఎస్ఆర్ అమౌంట్ కోట్లలో ఉంటుందట. ఎస్పీల అధీనంలో ఉండే ఆ నిధు లకు ఆడిటింగ్ వంటి చట్టపరమైన నిబంధనలు వర్తించవనీ చెబుతుంటారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటు నయీం తన దుర్మార్గాలను కొన సాగించడానికి, యథేచ్ఛగా జనాన్ని హింసించడానికి తోడ్పడిన ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొందరు పదవీ విరమణ చేశారు, కొందరు రాష్ట్ర విభజన అనంతరం అవతల రాష్ట్రానికి వెళ్లారు. కొంతకాలంగా నయీం ఆట ముగియనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడయితే అధికార పక్షానికే చెందిన కొనపురి రాములును హత్య చేశాడో, ఎప్పుడయితే అధికార పక్షానికే చెందిన కొందరు ప్రజా ప్రతినిధులను వారి వారి నియోజకవర్గాలకు వెళ్ల కుండా నిలువరించాడో, ఎప్పుడయితే వారి నుంచి సైతం కోట్లాది రూపా యలు డిమాండ్ చేశాడో అప్పుడే నయీం కథ ముగియబోతున్నదని అర్థ మైంది. సోమవారం అదే జరిగింది. మంచిదే కానీ, మరో నయీం పుట్టడన్న, పుట్టించబోమన్న హామీ మన పోలీసు పెద్దలు ఇవ్వగలరా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
నయీం గురించి వంటమనిషి ఏం చెప్పిందంటే..
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం చేసిన నేరాలను అతని దగ్గర వంటమనిషిగా పనిచేసిన ఫర్హానా (30) పోలీసుల విచారణలో వెల్లడించింది. నయీం కిడ్నాపులు, బెదిరింపులు, డబ్బు గుంజడం లాంటివి చేసేవాడని చెప్పింది. ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు, నగదు ఉండేవని ఫర్హానా తెలిపింది. పెద్ద మొత్తంలో భూములకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చేవాడని వెల్లడించింది. నయీం తరచూ కొందరికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చేవాడని చెప్పింది. ఫర్హానా చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్కౌంటర్లో నయీం హతమైన తర్వాత.. అలాపురి టౌన్ షిప్ వద్ద పోలీసులు ఫర్హానాతో పాటు కారు డ్రైవర్ భార్య అఫ్షాను అరెస్ట్ చేశారు. తుపాకులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల విచారణలో ఫర్హానా ఏం చెప్పిందంటే.. 'నా భర్త మరణించాక నయీం దగ్గర వంటమనిషిగా చేరాను. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నన్ను నయీం బంధువు హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. నాతో పాటు అఫ్షా అనే మహళ నయీం ఇంట్లో పనిచేసేది. అతని కుటుంబ సభ్యులను, పిల్లలను చూసుకునేవాళ్లం. అతని పిల్లలను అలాపురి టౌన్‌షిప్‌నకు తీసుకువచ్చేవాడు. నయీంకు మాపై నమ్మకం ఉండేది. సోమవారం అఫ్షాతో కలసి టీవీ చూస్తున్నాను. ఆ సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. నయీం మరణించాడని గుర్తించాం. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాం. కొంత నగదుతో బయటపడాలనుకున్నాం. అయితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు' అని చెప్పింది. -
ముంబై మాఫియాను మించి.. నయీం ఆస్తులు
-
నయీం అంత్యక్రియలపై వివాదం
-
నయీం అంత్యక్రియలపై వివాదం
భువనగిరి: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం అంత్యక్రియలు నిర్వహించే విషయంపై వివాదం ఏర్పడింది. నయీం భార్య, పిల్లలు వచ్చే వరకు అంత్యక్రియలు చేయబోమని బంధువులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం నయీం మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతని బంధువులకు అప్పగించారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా భువనగిరికి తరలించారు. కాసేపట్లో నయీం అంత్యక్రియలు జరగవచ్చు. భువనగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. కాగా నయీం హతమైన తర్వాత పోలీసులు అతని భార్య, పిల్లలతో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. నయీం అంత్యక్రియలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత్యక్రియల దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ చేయరాదని, ఆంక్షలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. -
ముంబై మాఫియాను మించి.. నయీం ఆస్తులు
హైదరాబాద్: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. నయీం ఆస్తుల వివరాలు కొండాపూర్‌లో ఒకే చోట 69 ఎకరాల భూమి దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని రెవిన్యూ అధికారాలు అంచనా పుప్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చు నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో బొమ్మలరామరంలో 500 ఎకరాలు హైదరాబాద్ నగరంలో పదలుకొద్దీ ఫ్లాట్లు ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు ఆడి కారు సహా హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లు సరూర్ నగర్‌లోని ఎన్టీఆర్ నగర్లో 1180 గజాల సైటు ప్లాను స్వాధీనం గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నెంబర్ 230/231 పత్రాలు స్వాధీనం అత్తాపూర్‌లో సర్వే నెం 462, 468లో ఫ్లాటు నెంబర్ 9 పత్రాలు గుర్తింపు కొండాపూర్‌లో సర్వే 87 పత్రాలు స్వాధీనం షేక్‌పేట్‌లో మరో ఫ్లాటు పత్రాలు స్వాధీనం ముసారాబాద్లో మరో నాలుగు స్థలాల పత్రాలు గుర్తింపు జూబ్లిహిల్స్‌లో 1365 గజాల స్థలాన్ని లాక్కున్న నయీం భువనగిరిలోనే 175 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తింపు ఘట్కేసర్, రామంతపూర్ గౌలిపుర, అమీన్‌పుర ప్రాంతాలకు చెందిన భూమి పత్రాలు స్వాధీనం ఆయుధాలు, ఫోన్లు ఇప్పటివరకు 4 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్ఫోన్లు స్వాధీనం డైరీలు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, మెమొరీ కార్డుల, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం -
నయీం డైరీల్లో కీలక వివరాలు
-
నయీం డైరీల్లో కీలక వివరాలు
హైదరాబాద్: ఎన్కౌంటర్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. డబ్బు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వందల సంఖ్యలో బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్బుక్లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు శంషాబాద్ డీసీపీ చెప్పారు. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు. నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు. బలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని తెలిపారు. షెల్టర్లు, డెన్లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నయీం టార్గెట్ చేసిన ధనవంతుల వివరాలను డైరీలో రాశాడని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. -
నయీమ్ హతం
-
నయీమ్ ఖతమ్
-
నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు!
-
పోలీసుల కాల్పుల్లో నయీమ్ హతం
-
నయీమ్ ఖతమ్
షాద్‌నగర్‌లో కాల్చి చంపిన పోలీసులు ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్.. బెల్లి లలిత.. సాంబశివుడు.. పౌరహక్కుల నేత పురుషోత్తం.. పటోళ్ల గోవర్దన్‌రెడ్డి.. ఒక్కరా ఇద్దరా...! ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో..!! కరడుగట్టిన నేరగాడు నయీముద్దీన్ రక్తదాహానికి వీరంతా బలైనవారే!! హత్యలు, భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులతో రెండు దశాబ్దాలుగా టై సృష్టించిన ఈ కిరాతక నేర గాడి కథ ఎట్టకేలకు ముగిసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన పోలీసులు పక్కాగా వ్యవహరించి అతడు ఉన్న ఇంటిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. తొలుత పీపుల్స్‌వార్‌లో చేరిన ఇతడు.. తర్వాత నక్సల్స్‌ను అంతం చేస్తానని ప్రతినబూని పోలీసులకు దగ్గరయ్యాడు. అతడిచ్చిన సమాచారంతోనే పోలీసులు కూడా అనేక సందర్భాల్లో మావోయిస్టులకు చెక్ పెట్టారు. అటు పోలీసులతోపాటు ఇటు కొందరు రాజకీయ నేతల పరిచయాలతో రెచ్చిపోయిన నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసుల తూటాలకే బలయ్యాడు. నయీమ్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతడు నివాసం ఉంటున్న ఇంటిపైనా దాడులు చేశారు. ఇంటి నుంచి రూ. 2 కోట్లు, దాదాపు రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో అతడి అనుచరుడిగా భావిస్తున్న శ్రీధర్‌గౌడ్ ఇంటి నుంచి కూడా రూ. 38 లక్షలు పట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండున్నర దశాబ్దాల రక్తచరిత్రకు తెర పడింది! కరడుగట్టిన నేరగాడు, మావోయిస్టు మాజీ నేత నయీముద్దీన్ (50) కథ ముగిసింది. ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా చంపించిన నయీమ్ చివరికి పోలీసు తూటాలకు నేలకొరిగాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని మిలీనియం కాలనీలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ వ్యాపార, వాణిజ్య వర్గాలను గడగడలాడించిన న యీంపై గతనెల 16న నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నయీమ్‌పై నిఘా పెట్టి అతడు షాద్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఇంటిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. ఆపరేషన్ నయీమ్ ఇలా.. షాద్‌నగర్ కేంద్రంగా నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు మిలీనియం కాలనీలోని ఓ ఇంటిపై నిఘా వేశారు. అందులో నయీమ్ ఉన్నట్లు నిర్ధారించుకుని.. సోమవారం తెల్లవారుజామునే కాలనీ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ బయటికి రావద్దని కాలనీవాసులకు చెప్పారు. వారి మొబైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ ఏఎస్పీ కల్మెశ్వర్ సింగెనవర్ నేతృత్వంలో ప్రత్యేక, స్థానిక పోలీసులు ఉదయం 8 గంటలకు నయీమ్ ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. దూరం నుంచే ఇంట్లో అతడి కదలికలను జాగ్రత్తగా గమనించారు. అప్పటికే నయీమ్ పోలీసులను పసిగట్టాడు. ఇంటికి, పోలీసులకు మధ్య వంద అడుగుల దూరం ఉండటంతో వెంటనే తేరుకున్న నయీమ్ అందుబాటులో ఉన్న ఫోర్డ ఎండీవర్ కారులోకి డ్రైవర్‌తో సహా ఎక్కాడు. కారు స్టార్ట చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చుట్టుముట్టడంతో ఎటూ వెళ్లలేమని గ్రహించిన కారు డ్రైవర్... మొదట పిస్టల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. అదే సమయంలో కారులోంచి నయీమ్ కిందికి దిగాడు. ఏకే 47తో పొజిషన్ తీసుకుని పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఒక్కడే కావడంతో నయీమ్ ఎటూ వెళ్లలేకపోయాడు. పోలీసులు వెంటవెంటనే 8 రౌండ్లు కాల్చడంతో నయీమ్ ఛాతీ, తొడలోకి మూడు బుల్లెట్లు(ఒకటి ఛాతీ కుడివైపు, రెండు తొడలోకి) దిగాయి. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 20 నిమిషాలపాటు ఎన్కౌంటర్ సాగింది. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నయీమ్ మరణించినట్లు ధ్రువీకరించారు. మరోవైపు పారిపోయిన డ్రైవర్‌ను రంగారెడ్డి జిల్లా షాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. నయీమ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే ఇంటిని సోదా చేశారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వేరేచోటుకి తరలించినట్లు తెలుస్తోంది. ఎవరీ ఉసూర్ బాష? నయీమ్‌కు ఆశ్రయమిచ్చిన ఉసూర్ బాషా రెండున్నర సంవత్సరాల క్రితం షాద్‌నగర్‌లో ఇల్లు కొన్నట్టు తెలిసింది. ఇందులో బాషాకు సంబంధించిన ఓ మహిళ నివాసం ఉండేదని, ఆమె ఒక్క రోజు కూడా తలుపు తీసి బయటకు వచ్చిన సందర్భం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానిస్తే తలుపుకు ఉన్న చిన్న రంధ్రం ద్వారానే మాట్లాడేదని ఓ మహిళ తెలిపింది. షాద్‌నగర్‌లో పోస్టుమార్టం షాద్‌నగర్ ఎమ్మార్వో చందర్రావు, కొత్తూరు ఎమ్మార్వో ఘటనాస్థలికి చేరుకుని పోలీసు అధికారుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం నయీమ్ మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. శవ పంచనామా, పోస్టుమార్టం అంతా వీడియో చిత్రీకరించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో కనిపెట్టి.. షాద్‌నగర్‌ను సురక్షిత జోన్‌గా ఎంచుకున్న నయీమ్.. తన ముఖ్య అనుచరుడైన ఉసూర్ బాషాకు చెందిన ఇంట్లో మకాం వేశాడు. కుటుంబసభ్యులతో వచ్చి వెళ్తుండేవాడు. డిచ్పల్లికి చెందిన రియల్టర్‌ను కోటి రూపాయలు కావాలని బెదిరించిన కేసును విచారిస్తున్న పోలీసులు.. షాద్‌నగర్ ప్రాంతం నుంచే నయీమ్ ఫోన్ చేస్తున్నట్లు సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అతడికి సహకరిస్తున్నారని అనుమానం ఉన్నవారి కదలికలపై 20 రోజులుగా ప్రత్యేక నిఘా ఉంచారు. ఉసూర్ బాషా ఇంటికి నయీమ్ పలువురు మహిళలతో తరచూ వస్తున్నాడని గుర్తించారు. సోమవారం ఉదయం నయీమ్ ఆ ఇంటిలోనే మకాం వేశాడని పక్కాగా ధ్రువీకరించుకున్న పోలీసులు తమ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ ఇంటి నుంచి ఉసూర్ బాషాతోపాటు పలువురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. షాద్‌నగర్.. ఎందుకు? హైదరాబాద్‌కు షాద్‌నగర్ అతి సమీపంలో ఉంది. ఇక్కడినుంచి గంటలో రాజధానికి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా సమీపంలో ఉంటుంది. షాద్‌నగర్‌కు వచ్చేందుకు రెండు మూడు దారులుంటాయి. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఒక్కో దారిలో రావొచ్చు. అలాగే షాద్‌నగర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఎవరెవరు ఉంటారో పక్కింటి వారికి కూడా తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని నయీమ్ సేఫ్ షెల్టర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన కదలికలు తెలియకుండా ఉండేందుకు నయీమ్ ఎటు వెళ్లినా వాహనంలో మహిళలు ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వాడని, వారిని కూడా తరచూ మారుస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఇంటిని సోదా చేయడానికి వెళ్లాం: ఎస్పీ రెమా రాజేశ్వరి షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో జరిగిన ఎన్కౌంటర్లో నయీముద్దీన్ మరణించాడని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎన్కౌంటర్ తర్వాత ఘటనాస్థలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘గతనెల 16న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ వ్యాపారిపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు అక్కడ ఫిర్యాదు నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆ గ్యాంగ్ కోసం విచారణ జరుపుతుండగా షాద్‌నగర్ ప్రాంతం నుంచి ఆ వ్యాపారికి బెదిరింపులు వెళ్లాయని నిర్ధారించుకున్నాం. ఈ క్రమంలో మిలినీయం కాలనీలోని ఓ ఇంటిని సోదా చేయడానికి పోలీసు బృందాలతో వెళ్లాం. అప్పటికే ఆ ఇంటినుంచి పోలీసులను చూసి కొందరు కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్త్తి ముందు కాల్పులు జరిపాడు. పోలీసులు ప్రతిఘటించడంతో డ్రైవర్ పారిపోయాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి కాల్పులు కొనసాగించాడు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. కాల్పుల అనంతరం ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించగా నయీమ్‌గా గుర్తించాం’’ అని ఆమె వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్థలాన్ని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ పరిశీలించారు. షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఆత్మరక్షణ కోసమే నయీంపై కాల్పులు!
మహబూబ్‌నగర్ : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం ఎన్కౌంటర్ ఘటనపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్‌ను వెంబడించాం. అయితే, కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తే నయీం అని తర్వాత తేలింది' అని ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారిన నయీం పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు, రాజకీయ నాయకులూ సైతం ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 50కి పైగా హత్యలు, పలు బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నక్సలైట్‌గా తన జీవిత ప్రస్థానం ప్రారంభించిన నయీం అనంతరం హత్యలు, దోపిడీలు, దందాలతో కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంటిపై పోలీసుల జరిపిన దాడిలో పట్టుబడ్డ డబ్బును లెక్కించడానికి 4 క్యాష్ కౌంటింగ్ మిషన్లు వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నయీం ఆర్థిక పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. నయీం 'సాక్షి' వెబ్సైట్ సమగ్ర కథనాలు ఇవి..! 1. ఎవరీ నయీం? 2. షాద్ నగర్ లో కాల్పులు, నయీం హతం 3. 'పక్కా సమాచారంతోనే స్కెచ్' 4. నయీం జాడ ఎలా దొరికిందంటే..? 5. నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు! 6. నయీం చనిపోవడం ఆనందంగా ఉంది : సాంబశివుడు తండ్రి 7. పోలీసుల అదుపులో నయీం కుటుంబసభ్యులు -
నయీం జాడ ఎలా దొరికిందంటే..?
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ్పీటీసీ భర్త గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్‌స్టర్ నయీం జాడ పోలీసులకు దొరికింది. ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసి నయీం షాద్ నగర్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ నయీం ముఠా గత జూలైలో గంగాధర్‌ను బెదిరించింది. దీంతో ఆయన గత నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం ముఠా కదిలికలపై నిఘా వేయడంతో పాటు ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేశారు. వాళ్లు షాద్ నగర్లో ఉన్నట్టు పక్కాగా సమాచారం వచ్చింది. నయీం ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతని అనుచరుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నయీం హతమయ్యాడు. -
నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు!
నల్లగొండ: భువనగిరిలో గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు నయీం అనుచరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మిర్యాలగూడలో నయీం అత్త, ఆమె అక్క ఇళ్లల్లో సోదాలు చేసి 6.50 లక్షల రూపాయల నగదు, రెండు బ్యాగుల్లో డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో నయీం ఇంట్లోను, అతని అనుచరుల ఇళ్లల్లోను తనిఖీలు చేపట్టారు. పోలీసులు భువనగిరి ఎంపీపీ వెంకట్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో పోలీసులు సోదాలు చేసి నయీం అనుచరులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం అనుచరుల ఇంట్లో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. పోలీసులు రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు నయీం ఈ ఇంటిని అడ్డాగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ రమా రాజేశ్వరి పరిశీలించారు. పోలీసులు నయీం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నయీం భార్య, కూతురు, అత్త, బావమరిది ఉన్నారు. -
ఆత్మరక్షణ కోసమే కాల్పులు
-
ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ : షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్‌ను వెంబడించారన్నారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్లు ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. చనిపోయిన వ్యక్తి నయీంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు నయీం భార్య, కుటుంబసభ్యులు ఉన్నట్లు అనుమానంతో నార్సింగ్ లోని ఓ అపార్ట్‌మెంట్‌ను పోలీసులు చుట్టుముట్టారు. కాగా నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. -
'పక్కా సమాచారంతోనే స్కెచ్'
హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్ మెన్ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది. అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి.