ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.