nayeemuddin
-
కాసేపట్లో రిమాండ్ కు నయీం అనుచరుడు శేషన్న
-
నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం ప్రధాన అనుచరుడిగా చలామణీ అయిన శేషన్న అలియాస్ రామచంద్రుడిని పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మహాబూబ్నగర్జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న సుదీర్ఘకాలం నయీంతో కలిసి పనిచేశారు. నయీంకు సంబంధించిన యాక్షన్టీంకు నేతృత్వం వహించారు. 2016 ఆగస్టులో షాద్‌నగర్‌లో జరిగిన నయీం ఎన్కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని కర్నూల్లోనూ పలు సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌లో నమోదైన కేసులో శేషన్న వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడిని పోలీసులు సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న దగ్గరి నుంచి పలు డాక్యుమెంట్లతో పాటు 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (‘జనసేన నాయకులు అన్యాయం చేశారు’) -
నయీమ్ అనుచరుడునంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్‌లో పని చేసే మార్కెటింగ్ మేనేజర్‌కు ఫోన్ చేసి నయీముద్దీన్(లేట్) అనుచరుడిని రూ 4 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడిని సోమవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హబ్సిగూడకు చెందిన ఎ. యాదవ్రెడ్డి పీర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో శ్రీ సాయిహరి హర ఎస్టేట్స్ ప్రైవేట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్ద టి.వి శ్రీనివాస్‌రావు మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 16వతేదీన శ్రీనివాస్‌రావు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను నయీముద్దీన్ అనుచరుడు రహీం బాయ్‌ని మాట్లాడుతున్న రూ 4 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కంగారు పడిన శ్రీనివాస్‌రావు తన యజమాని యాదవ్రెడ్డికి చెప్పాడు. అనంతరం ఇద్దరు కలిసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌రావు వచ్చిన బెదిరింపు కాల్ ఆధారంగా మేడిపల్లి పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ సిగ్నల్స్ ఆధారంగా సోమవారం బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడు బోడుప్పల్లో ఉన్నాడని తెలుసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఉప్పల్ స్వరూప్‌నగర్‌లో నివసించే బేతి విజయ్‌రెడ్డి అలియాస్ విక్కీ, అలియాస్ రహీం(20) డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ చదువుకుని ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆర్థికంగా నష్ట పోయాడు. దీంతో నయీముద్దీన్ అనుచరుడు అని చెప్పుకుని డబ్బులు సంపాదించాలని ప్రణాళిక రూపొందించాడు. ఈక్రమంలో పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లోని శ్రీసాయి హరి హర ఎస్టేట్‌లో పని చేసే మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేసే శ్రీనివాస్‌రావు ఫోన్ చేసి రూ 4 కోట్లు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి వెల్లడించారు. 22టిఎఆర్43)బేతి విజయ్‌రెడ్డి -
'నయీంను పెంచింది వాళ్లు.. అంతం చేసింది మేము'
నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిశోర్, ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని, ఇప్పుడు తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యామని గాదరి కిశోర్ చెప్పారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. అహంకార ధోరణితో తమపై నిరాధార ప్రేలాపనలు చేస్తున్నారని, పిచ్చికూతలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ప్రజలే బట్టలూడదీసి కొడతారని.. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇదే తమ హెచ్చరిక అని కిశోర్ అన్నారు. ఇక నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నాయని చెప్పడం వాళ్ల అవివేకం అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ పదేళ్లు పెంచి పోషించిన క్రూరమృగాన్ని అంతంమొందించింది ఎవరో అందరికీ తెలుసని, నయీం ముచ్చట వాళ్లు ఊరికే మాట్లాడుతున్నారని చెప్పారు. నయీంతో తమకు హాని ఉన్న విషయాన్ని నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆ నేతలే అన్నారని.. అలాంటి క్రూరమృగాన్ని అంతమొందించింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గాను ప్రజల మెప్పును పొందుతుంటే ఓర్వలేక ఇలా చెబుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకం లేదు గానీ అధికారుల మీద నమ్మకం ఉందని చెబుతున్నారని.. ఆ అధికారులను ఆ స్థానంలో పెట్టింది కేసీఆరేనని మర్చిపోకూడదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఎంతో హైప్ ఉన్న ప్రధానమంత్రి మోదీ కూడా కేసీఆర్ గురించి గొప్పగా ప్రశంసించారని, కేసీఆర్ ఇంత బాగా పనిచేస్తుంటే పచ్చకామెర్ల రోగిలా మాట్లాడుతుంటే బాధాకరమని ఆయన అన్నారు. మీకు హైప్ వచ్చిందో, అయిపోవచ్చిందో ప్రజలే ఆలోచించుకుంటారని, వాళ్లు చైతన్యవంతులని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమైనా అనుమానాలుంటే సిట్ అధికారులకు ఒక దరఖాస్తు ఇవ్వడమో, ఫోన్ చేసి చెప్పడమో చేయాలని సూచించారు. పొరపాటు ఎవరు చేసినా చట్టానికి అతీతులు కారని.. ఎవరు తప్పుచేసినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. -
'నయీంను పెంచింది వాళ్లు అంతం చేసింది మేము'
-
నయీం పేరు కూడా వినలేదు: రిటైర్డ్ ఎస్పీ
తాను అసలు నయీం పేరు కూడా విన్నట్లు గుర్తులేదని రిటైర్డ్ పోలీసు అధికారి శివానందరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో తాను అతి తక్కువ కాలం మాత్రమే ఏఎస్పీగా పనిచేశానని, అది కూడా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కావడంతో శాంతిభద్రతల గురించి, తీవ్రవాదుల కార్యకలాపాల గురించి తనకు పెద్దగా తెలియదని ఆయన అన్నారు. 2003 వరకు తాను నల్లగొండ జిల్లాలో ఉన్నానని, అప్పటికి అతడిపేరు కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదని తెలిపారు. తాను సజ్జనార్, శివధర్‌రెడ్డి లాంటి అధికారుల వద్ద పనిచేశానని, వాళ్లు చాలా మంచి పేరు కలవారని.. వాళ్లకు నయీంతో సంబంధం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాను అడ్మినిస్ట్రేషన్‌లో ఉండటంతో ఇన్ఫార్మర్ల వ్యవస్థ గురించి పెద్దగా తెలియదన్నారు. అలాగే ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఎస్ఐలు, సీఐలలో 99 శాతం మందికి నయీంతో లింకులు ఉన్నాయంటే తాను నమ్మనని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉన్నట్లే పోలీసు శాఖలో కూడా ఒకరిద్దరు బ్లాక్ షీప్ ఉండొచ్చని, కానీ అంతమాత్రాన అందరి మీద ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. తన తండ్రి కాంగ్రెస్ నాయకుడని.. కానీ తనకు మాత్రం రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. టీడీపీ వాళ్లు నయీం విషయంలో తనకు ఎప్పుడూ ఫోన్లు చేయలేదని చెప్పారు. అయినా అప్పట్లో రాజకీయ నాయకుల మాట వినాల్సిన అవసరం జిల్లా ఎస్పీలకు ఉండేది కాదని, ప్రధానంగా ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలు చూసేవాళ్లకు ఆ అవసరం ఉండేది కాదని అన్నారు. తాను పదవీ విరమణ చేసి ఏడేళ్లవుతోందని, ఒక్క చానల్ లో మాత్రమే తన పేరు వచ్చిందని తెలిపారు. నల్లగొండలో పనిచేశానని తన పేరు బయటకు వచ్చి ఉండొచ్చేమో గానీ.. దాన్ని ఖరారు చేసుకుని ఉపయోగించాలని సూచించారు. తమ కుటుంబానికి రాజకీయ చరిత్ర కూడా కేవలం నందికొట్కూరులో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. -
నయీం పేరు కూడా వినలేదు: రిటైర్డ్ ఎస్పీ
-
నయీమ్.. నన్ను బెదిరించాడు
రైతు గర్జన సభలో రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్ఎస్ నేతలకు నయీమ్‌తో సంబంధాలన్న కాంగ్రెస్ నేత కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు: దిగ్విజయ్ టీఆర్ఎస్ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ తనను ఎన్నోసార్లు బెదిరించాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నయీమ్ మనుషులు తన దగ్గరకు వచ్చి, పోటీ నుంచి తప్పుకోవాలంటూ హెచ్చరించారన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు గర్జన బహిరంగ సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నయీమ్ బెదిరింపులకు తాను బెదరలేదన్నారు. నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్ఎస్ నాయకులకు నయీమ్‌తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై నమ్మకం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘‘పోలీస్స్టేషన్లను, తహసీల్దార్ కార్యాలయాలను టీఆర్ఎస్ నేతలు తమ అధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారు. సీఎం చివరికి వయసు సరిపోతే తన మనవడికి కూడా ఎమ్మెల్సీ పదవిచ్చేలా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులున్నా అంతా ఏకమై ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నాం’’ అని అన్నారు. సంక్షోభంలో రైతన్న: దిగ్విజయ్ ఎన్నికల హామీల అమలులో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమవుతోందని సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. రెండున్నరేళ్ల పాలనలో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే. వాటి అంచనా వ్యయాలను భారీగా పెంచడంలో అవినీతి దాగుంది. ఈ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం’’ అని ప్రకటించారు. రైతులు పత్తి పండించవద్దని ముఖ్యమంత్రే చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే మల్లన్నసాగర్ భూ సేకరణ చేయాలన్నారు. దీనిపై హైకోర్టులో చుక్కెదురవడం సర్కారు పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్ పోరాటానికి మద్దతిచ్చే ముందు అంతర్గత శాంతిభద్రతలపై దృష్టి సారించాలన్నారు. దళితుల కంటే ముందు తనను కాల్చండనడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి దిగ్విజయ్ తన ప్రసంగంలో పలుమార్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలో సాగు, తాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సభలో పలుమార్లు కార్యకర్తలు వైఎస్సార్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతులు వలస కూలీలుగా ముంబై మురికివాడల్లో దయనీయ జీవితం గడుపుతున్నారని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు ఆవేదన వెలిబుచ్చారు. కాంట్రాక్టర్ రాజ్: ఉత్తమ్ ధ్వజం కాంగ్రెస్ పాలనలో రైతేరాజన్న ధ్యేయంతో పని చేస్తే, కేసీఆర్ సర్కారులో మాత్రం కాంట్రాక్టర్లే రాజాలుగా వర్ధిల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బలవంతపు భూసేకరణకు దిగితే సహించబోమని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే వెళ్లాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మంది రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి. 3 లక్షల మంది మహిళా రైతుల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయి. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అంచనాల్లో టీఆర్ఎస్ సర్కారు మాయ చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.26 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెంచిందని దుయ్యబట్టారు. ఏఐసీసీ కార ్యదర్శి కుంతియా, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, జి.చిన్నారెడ్డి, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కిగౌడ్, షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు సభలో పాల్గొన్నారు. 30న కాంగ్రెస్ నేతలకు శిక్షణ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఈ నెల 30న శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఆదిలాబాద్‌లో దిగ్విజయ్ అధ్యక్షతన నిర్వహించిన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. -
మమ్మల్ని నయీంతో హత్య చేయించేవారేమో!
-
నయీంతో సిటీ మాజీమంత్రి చెట్టపట్టాలు?
నయీం కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొందరు పోలీసు ఉన్నతాధికారులు, పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నయీంతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈగ్యాంగ్స్టర్తో కలిసి ఎన్నో భూ దందాలు, సెటిల్మెంట్లు చేసినట్లు వార్తలొస్తున్నాయి. డైరీలో ఈ అంశాలను నయీం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తుండగా... ఆ మంత్రి ఎవరై ఉంటారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లోని దాదాపు 42 మంది అధికారులు నయీంకు సహకరించినట్లు సమాచారం. వారిలో ఎక్కువమంది ఉన్నతాధికారులే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ జాబితాలో 18మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని... వీరిలో సర్వీసులో ఉన్నవారు 9 మంది, రిటైరైనవారు 9 మంది ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలివారు కింది కేడర్ అని సమాచారం. డీసీపీ, ఏసీపీలుగా ఉన్నవారి నుంచి ఉన్నతస్థాయి వరకు నయీంకు తోడూ.. నీడగా నిలిచినట్లు సమాచారం. నక్సల్స్ వ్యవహారాలపై నిఘా పెట్టే స్పెషల్ ఇంటెలిజెన్స్‌లో పనిచేసి రిటైర్ అయిన వారిలో ఆరుగురు ఎస్పీ కేడర్ అధికారులకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా కేసీఆర్‌కు ఇచ్చిన నివేదికలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే, నయీం వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన కొందరు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. -
కోర్టులో లొంగిపోయిన ఫహీం
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీం, అతడి భార్య షహీమ్ శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వారిద్దరికీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఫహీం పేరు మీద కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఫహీం ఏ2గా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఫహీం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ తరఫున ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. అయితే నయీం అక్రమాల చిట్టా వివరాలు తనకేమీ తెలియదని ఫహీం చెప్పడం గమనార్హం. మరోవైపు ఫహీంను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. కాగా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫహీం సెటిల్మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫహీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. శ్రీధర్, బలరాంను నిన్న హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. -
వంట మనిషి కాదు.. నయీమ్ నీడ
-
వంట మనిషి కాదు.. నయీమ్ నీడ
* ఫర్హానాకు తెలియకుండా చిల్లిగవ్వ కూడా లావాదేవీ జరిగేది కాదు * గోవాలోని నయీమ్ గెస్ట్‌హౌస్ కూడా ఫర్హానా పేరిటే రిజిస్ట్రేషన్ * కోకోనట్ అని ఫర్హానాను ముద్దుగా పిలుచుకునే గ్యాంగ్‌స్టర్ * పోలీసుల విచారణలో వెల్లడించిన వాచ్‌మన్ తాజుద్దీన్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. నెక్నాంపూర్‌లోని అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నానని చెప్పిన ఫర్హానా(30) సాధారణ మహిళ కాదట. నయీం ప్రతి కదలిక వెనుకా ఆమె పాత్ర ఉందట. ఇంట్లో పనులు మాత్రమే చేస్తానని చెప్పిన ఈమె పేరు మీద గోవా పాండా ఠాణా పరిధిలోని పొండబొరిన్ ప్లాట్ నంబర్ 274లోని నయీం గెస్ట్‌హౌస్‌గా చెప్పుకుంటున్న ఇల్లు రిజిస్టరై ఉందని వెల్లడైంది. నార్సింగ్ పోలీసులకు పట్టుబడిన గోవాలో నయీం గెస్ట్‌హౌస్‌లో వాచ్‌మన్ తాజుద్దీన్ పోలీసు విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టడు. దీంతో ఆమె పాత్రపై లోతుగా అధ్యయనం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తాజుద్దీన్.. గోవాలో నయీం నేర కార్యకలాపాలు బాగానే జరుగుతుండేవని పోలీసులకు తెలిపాడు. పుప్పాలగూడ పంచాయతీ పరిధిలోని అంజలిగార్డెన్లోనూ ఫర్హానాకు ఏడాది క్రితం నయీమ్ ఇల్లు కొనిచ్చాడని తెలిసింది. రెండు రోజుల క్రితమే ఈ ఇంట్లో పోలీసులు సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వినోదం, లావాదేవీలకు అడ్డాగా.. భార్య హసీనా బేగమ్తో ఆడపాదడపా నయీమ్ గోవాకు వెళ్లేవాడు. అయితే ఎక్కువసార్లు ఫర్హానాతోనే వెళుతుండేవాడు. అలాగే సదా, కరీనా, జేబ, ఇతర అమ్మాయిలనూ అక్కడకు తీసుకెళ్లేవాడు. గోవా నుంచే డబ్బు లావాదేవీలు భారీ మొత్తంలో సాగేవి. భూ సెటిల్మెంట్లకు సంబంధించిన విషయాల మీద కూడా భారీగానే చర్చించేవారు. చాలా మంది అమ్మాయిలతో నయీమ్ గెస్ట్‌హౌస్‌లో ఎంజాయ్ చేసేవాడు. ఫర్హానాను నయీమ్ ముద్దుగా కోకొనట్ అని పిలిచేవాడు. నయీమ్ ప్రతి ఆర్థిక లావాదేవీనీ ఈమె పర్యవేక్షిస్తుండేది. నయీమ్ ఆదేశాల ప్రకారం కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుని తాజుద్దీన్ నయీంకు అందజేసేవాడు. నయీమ్ ఉపయోగించే ఫోన్లు, సిమ్‌లు బాక్స్‌లో పెట్టుకునేవాడు. తన రూమ్, ఏఏ గదుల్లో డబ్బులు ఉంచాననే సీక్రెట్ లాంగ్వేజ్‌తో ఓ మ్యాప్‌ను రెడీ చేసి హాల్లో అంటించిపెట్టేవాడు. గోవాకు వచ్చినప్పుడల్లా పల్సర్ టీవీఎస్ స్కూటీ పెప్ బైక్‌లపై చక్కర్లు కొట్టేవాడు. గోవాలోని నయీం బెడ్రూమ్లో డబ్బు, భూ డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులు భద్రపరుచుకునేవాడు. అయితే ఇటీవల గోవాలోనే చర్చ్‌కు సమీపంలోని చర్చ్హౌస్గా పిలిచే మరో ఇంటిని నయీమ్ కొనుగోలు చేశాడు. అయితే ఏపీ, తెలంగాణలోని భూ దందాలకు సంబంధించిన సెటిల్మెంట్లను అక్కడి నుంచి చేసేవాడని తెలుస్తోంది. ఎవరీ తాజుద్దీన్..? నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని అబ్బాసియా కాలనీ మహమ్మద్ తాజుద్దీన్ స్వస్థలం. తాజుద్దీన్ పసితనంలోనే సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన తండ్రి కన్నుమూశాడు. ఆ తర్వాత నల్లగొండలోని తాత ఇంటికి అతని కుటుంబం వెళ్లింది. అక్కడే పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత పంక్చర్ షాప్ మొదలెట్టాడు. 1990లో మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ బేగమ్‌ను పెళ్లాడాడు. తర్వాత హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌కు మకాం మార్చాడు. కొన్నిరోజులు ఇక్కడా పంక్చర్ దుకాణం నిర్వహించి గిట్టుబాటు కాక తుక్కుగూడలోని ఓ కంపెనీలో వాచ్‌మన్‌గా చేరాడు. నల్లగొండకు చెందిన అఫ్రోజ్‌తో కూతురు బేగమ్‌కు పెళ్లి చేసే సమయంలో కొంత మంది నుంచి అప్పు తెచ్చాడు. ఈ సమయంలో దూరపు బంధువు నయీమ్‌ను కలసి డబ్బులు సర్దాలని కోరాడు. రూ.30 వేల అప్పు ఇచ్చిన నయీం.. గోవాలోని తన గెస్ట్ హౌస్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేయాలని కోరాడు. ఇందుకు నెలవారీగా జీతం ఇస్తానన్నాడు. దీంతో చంపాపేటలోని అత్తమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉంచి తాజుద్దీన్ 2012లో గోవాకు వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడ తాజుద్దీన్ పనిచేస్తున్నాడు. ఇలా పట్టుబడ్డాడు.. పోలీసులు నయీమ్‌ను ఎన్కౌంటర్ చేశారని తెలియడంతో భయపడిన తాజుద్దీన్ జీఏ-07-కే-0756 మహేంద్ర బొలెరో వాహనంలో నయీమ్ బెడ్రూమ్లో నగదుతో ఉన్న ఓ బ్యాగ్ తీసుకుని, ఈ నెల 11న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పుప్పలగూడ చేరుకున్నాడు. గోవా నంబర్ ప్లేట్ గల వాహనం వస్తోందని పోలీసులకు సమాచారం అందగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో తాజుద్దీన్ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా అన్ని లావాదేవీల్లో ఫర్హానా(ఏ1)ది కీలక పాత్ర అని, గోవా గెస్ట్‌హౌస్ ఆమె పేరు మీదనే ఉందని తెలిపాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ కేసు డైరీలో పేర్కొన్నారు. తాజుద్దీన్ నుంచి రూ.4,30,000 నగదు, మహేంద్ర బొలెరో వెహికల్, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించింది. నయీమ్ అల్లుడా మజాకా.. నయీమే కాదు భూ దందాల్లో వారి బంధువులూ ఉన్నట్టు తెలుస్తోంది. రోజురోజుకీ సెటిల్మెంట్ల లిస్టు పెరుగుతుండటంతో ఆ బాధ్యతల్ని తనకు నమ్మకమైన బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని నయీమ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో ఎక్కువగా నయీమ్ అల్లుడు ఫహీం భూదందాలు సెటిల్ చేస్తున్నాడు. చాలా మంది అనుచరులు ఇతని కిందే పనిచేశారు. హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్‌గౌడ్ ఇంటిని ఫయీం సెటిల్మెంట్లకు ఉపయోగించుకునేవాడు. ఫయీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్‌రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్‌లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఫహీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్‌గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే శ్రీధర్, బలరాంను హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్‌గౌడ్, ఏ4గా సుధాకర్, ఏ5 వెంకటేష్, ఏ6 శ్రీధర్‌రాజు, ఏ7 కరుణాకర్, ఏ8 శ్రీను, ఏ9 బలరాంగా పేర్కొన్నారు. శ్రీధర్, బలరామ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న ఆరుగురి గురించి ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ఆదిభట్లలోనూ నయీం ఆగడాలు!
నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లను బెదిరించి కోట్ల విలువైన భూములను ఈ ముఠా కొట్టేసినట్లు బయటకు వస్తోంది. ఇటీవలి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతంలో కూడా నయీం ముఠా ఆగడాలకు పాల్పడింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల ప్రాంతంలో తనకున్న 41 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు నయీం ముఠా ప్రయత్నించిందని బాధితుడు లయన్ లింగారెడ్డి 'సాక్షి'కి తెలిపారు. భూమి అప్పగించాలంటూ తనను బెదిరించారని, తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఆ 41 ఎకరాలను కబ్జా చేసేందుకు వాళ్లు ప్రయత్నించారని చెప్పారు. వందలమంది రౌడీలను తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టించారని, దాంతో తాను పోలీసులను ఆశ్రయించగా.. ఆ తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని లింగారెడ్డి అన్నారు. తన భూమిని కబ్జా చేయడమే కాక, తనమీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. ప్రోత్సహించింది ప్రభుత్వం, పోలీసులే కాగా నయీంను గత ప్రభుత్వాలు, పోలీసులే ప్రోత్సహించారని నయీం చేతిలో హతమైన బెల్లి లలిత సోదరి కవిత ఆరోపించారు. నయీం అనుచరులను కూడా హతమార్చాలని ఆమె డిమాండ్ చేశారు. నయీంకు సహకరించిన రాజకీయ నేతల అంతు కూడా చూడాలన్నారు. -
నయీం గురించి వంటమనిషి ఏం చెప్పిందంటే..
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం చేసిన నేరాలను అతని దగ్గర వంటమనిషిగా పనిచేసిన ఫర్హానా (30) పోలీసుల విచారణలో వెల్లడించింది. నయీం కిడ్నాపులు, బెదిరింపులు, డబ్బు గుంజడం లాంటివి చేసేవాడని చెప్పింది. ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు, నగదు ఉండేవని ఫర్హానా తెలిపింది. పెద్ద మొత్తంలో భూములకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చేవాడని వెల్లడించింది. నయీం తరచూ కొందరికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చేవాడని చెప్పింది. ఫర్హానా చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్కౌంటర్లో నయీం హతమైన తర్వాత.. అలాపురి టౌన్ షిప్ వద్ద పోలీసులు ఫర్హానాతో పాటు కారు డ్రైవర్ భార్య అఫ్షాను అరెస్ట్ చేశారు. తుపాకులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల విచారణలో ఫర్హానా ఏం చెప్పిందంటే.. 'నా భర్త మరణించాక నయీం దగ్గర వంటమనిషిగా చేరాను. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నన్ను నయీం బంధువు హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. నాతో పాటు అఫ్షా అనే మహళ నయీం ఇంట్లో పనిచేసేది. అతని కుటుంబ సభ్యులను, పిల్లలను చూసుకునేవాళ్లం. అతని పిల్లలను అలాపురి టౌన్‌షిప్‌నకు తీసుకువచ్చేవాడు. నయీంకు మాపై నమ్మకం ఉండేది. సోమవారం అఫ్షాతో కలసి టీవీ చూస్తున్నాను. ఆ సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. నయీం మరణించాడని గుర్తించాం. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాం. కొంత నగదుతో బయటపడాలనుకున్నాం. అయితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు' అని చెప్పింది. -
ముంబై మాఫియాను మించి.. నయీం ఆస్తులు
-
నయీం అంత్యక్రియలపై వివాదం
-
నయీం అంత్యక్రియలపై వివాదం
భువనగిరి: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం అంత్యక్రియలు నిర్వహించే విషయంపై వివాదం ఏర్పడింది. నయీం భార్య, పిల్లలు వచ్చే వరకు అంత్యక్రియలు చేయబోమని బంధువులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం నయీం మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతని బంధువులకు అప్పగించారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా భువనగిరికి తరలించారు. కాసేపట్లో నయీం అంత్యక్రియలు జరగవచ్చు. భువనగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. కాగా నయీం హతమైన తర్వాత పోలీసులు అతని భార్య, పిల్లలతో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. నయీం అంత్యక్రియలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత్యక్రియల దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ చేయరాదని, ఆంక్షలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. -
ముంబై మాఫియాను మించి.. నయీం ఆస్తులు
హైదరాబాద్: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. నయీం ఆస్తుల వివరాలు కొండాపూర్‌లో ఒకే చోట 69 ఎకరాల భూమి దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని రెవిన్యూ అధికారాలు అంచనా పుప్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చు నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో బొమ్మలరామరంలో 500 ఎకరాలు హైదరాబాద్ నగరంలో పదలుకొద్దీ ఫ్లాట్లు ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు ఆడి కారు సహా హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లు సరూర్ నగర్‌లోని ఎన్టీఆర్ నగర్లో 1180 గజాల సైటు ప్లాను స్వాధీనం గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నెంబర్ 230/231 పత్రాలు స్వాధీనం అత్తాపూర్‌లో సర్వే నెం 462, 468లో ఫ్లాటు నెంబర్ 9 పత్రాలు గుర్తింపు కొండాపూర్‌లో సర్వే 87 పత్రాలు స్వాధీనం షేక్‌పేట్‌లో మరో ఫ్లాటు పత్రాలు స్వాధీనం ముసారాబాద్లో మరో నాలుగు స్థలాల పత్రాలు గుర్తింపు జూబ్లిహిల్స్‌లో 1365 గజాల స్థలాన్ని లాక్కున్న నయీం భువనగిరిలోనే 175 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తింపు ఘట్కేసర్, రామంతపూర్ గౌలిపుర, అమీన్‌పుర ప్రాంతాలకు చెందిన భూమి పత్రాలు స్వాధీనం ఆయుధాలు, ఫోన్లు ఇప్పటివరకు 4 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్ఫోన్లు స్వాధీనం డైరీలు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, మెమొరీ కార్డుల, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం -
నయీం డైరీల్లో కీలక వివరాలు
-
నయీం డైరీల్లో కీలక వివరాలు
హైదరాబాద్: ఎన్కౌంటర్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. డబ్బు, బంగారం, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వందల సంఖ్యలో బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్బుక్లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు శంషాబాద్ డీసీపీ చెప్పారు. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని తెలిపారు. నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు. బలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని తెలిపారు. షెల్టర్లు, డెన్లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నయీం టార్గెట్ చేసిన ధనవంతుల వివరాలను డైరీలో రాశాడని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నయీం బంధువులు, అనుచరులు ఇళ్లల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. -
నయీమ్ ఖతమ్
-
నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు!
-
పోలీసుల కాల్పుల్లో నయీమ్ హతం
-
నయీమ్ ఖతమ్
షాద్‌నగర్‌లో కాల్చి చంపిన పోలీసులు ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్.. బెల్లి లలిత.. సాంబశివుడు.. పౌరహక్కుల నేత పురుషోత్తం.. పటోళ్ల గోవర్దన్‌రెడ్డి.. ఒక్కరా ఇద్దరా...! ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో..!! కరడుగట్టిన నేరగాడు నయీముద్దీన్ రక్తదాహానికి వీరంతా బలైనవారే!! హత్యలు, భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులతో రెండు దశాబ్దాలుగా టై సృష్టించిన ఈ కిరాతక నేర గాడి కథ ఎట్టకేలకు ముగిసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన పోలీసులు పక్కాగా వ్యవహరించి అతడు ఉన్న ఇంటిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. తొలుత పీపుల్స్‌వార్‌లో చేరిన ఇతడు.. తర్వాత నక్సల్స్‌ను అంతం చేస్తానని ప్రతినబూని పోలీసులకు దగ్గరయ్యాడు. అతడిచ్చిన సమాచారంతోనే పోలీసులు కూడా అనేక సందర్భాల్లో మావోయిస్టులకు చెక్ పెట్టారు. అటు పోలీసులతోపాటు ఇటు కొందరు రాజకీయ నేతల పరిచయాలతో రెచ్చిపోయిన నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసుల తూటాలకే బలయ్యాడు. నయీమ్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతడు నివాసం ఉంటున్న ఇంటిపైనా దాడులు చేశారు. ఇంటి నుంచి రూ. 2 కోట్లు, దాదాపు రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో అతడి అనుచరుడిగా భావిస్తున్న శ్రీధర్‌గౌడ్ ఇంటి నుంచి కూడా రూ. 38 లక్షలు పట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండున్నర దశాబ్దాల రక్తచరిత్రకు తెర పడింది! కరడుగట్టిన నేరగాడు, మావోయిస్టు మాజీ నేత నయీముద్దీన్ (50) కథ ముగిసింది. ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా చంపించిన నయీమ్ చివరికి పోలీసు తూటాలకు నేలకొరిగాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని మిలీనియం కాలనీలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడు. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ వ్యాపార, వాణిజ్య వర్గాలను గడగడలాడించిన న యీంపై గతనెల 16న నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నయీమ్‌పై నిఘా పెట్టి అతడు షాద్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఇంటిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. ఆపరేషన్ నయీమ్ ఇలా.. షాద్‌నగర్ కేంద్రంగా నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు మిలీనియం కాలనీలోని ఓ ఇంటిపై నిఘా వేశారు. అందులో నయీమ్ ఉన్నట్లు నిర్ధారించుకుని.. సోమవారం తెల్లవారుజామునే కాలనీ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ బయటికి రావద్దని కాలనీవాసులకు చెప్పారు. వారి మొబైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ ఏఎస్పీ కల్మెశ్వర్ సింగెనవర్ నేతృత్వంలో ప్రత్యేక, స్థానిక పోలీసులు ఉదయం 8 గంటలకు నయీమ్ ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. దూరం నుంచే ఇంట్లో అతడి కదలికలను జాగ్రత్తగా గమనించారు. అప్పటికే నయీమ్ పోలీసులను పసిగట్టాడు. ఇంటికి, పోలీసులకు మధ్య వంద అడుగుల దూరం ఉండటంతో వెంటనే తేరుకున్న నయీమ్ అందుబాటులో ఉన్న ఫోర్డ ఎండీవర్ కారులోకి డ్రైవర్‌తో సహా ఎక్కాడు. కారు స్టార్ట చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చుట్టుముట్టడంతో ఎటూ వెళ్లలేమని గ్రహించిన కారు డ్రైవర్... మొదట పిస్టల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. అదే సమయంలో కారులోంచి నయీమ్ కిందికి దిగాడు. ఏకే 47తో పొజిషన్ తీసుకుని పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఒక్కడే కావడంతో నయీమ్ ఎటూ వెళ్లలేకపోయాడు. పోలీసులు వెంటవెంటనే 8 రౌండ్లు కాల్చడంతో నయీమ్ ఛాతీ, తొడలోకి మూడు బుల్లెట్లు(ఒకటి ఛాతీ కుడివైపు, రెండు తొడలోకి) దిగాయి. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 20 నిమిషాలపాటు ఎన్కౌంటర్ సాగింది. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నయీమ్ మరణించినట్లు ధ్రువీకరించారు. మరోవైపు పారిపోయిన డ్రైవర్‌ను రంగారెడ్డి జిల్లా షాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. నయీమ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే ఇంటిని సోదా చేశారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి వేరేచోటుకి తరలించినట్లు తెలుస్తోంది. ఎవరీ ఉసూర్ బాష? నయీమ్‌కు ఆశ్రయమిచ్చిన ఉసూర్ బాషా రెండున్నర సంవత్సరాల క్రితం షాద్‌నగర్‌లో ఇల్లు కొన్నట్టు తెలిసింది. ఇందులో బాషాకు సంబంధించిన ఓ మహిళ నివాసం ఉండేదని, ఆమె ఒక్క రోజు కూడా తలుపు తీసి బయటకు వచ్చిన సందర్భం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానిస్తే తలుపుకు ఉన్న చిన్న రంధ్రం ద్వారానే మాట్లాడేదని ఓ మహిళ తెలిపింది. షాద్‌నగర్‌లో పోస్టుమార్టం షాద్‌నగర్ ఎమ్మార్వో చందర్రావు, కొత్తూరు ఎమ్మార్వో ఘటనాస్థలికి చేరుకుని పోలీసు అధికారుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం నయీమ్ మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. శవ పంచనామా, పోస్టుమార్టం అంతా వీడియో చిత్రీకరించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో కనిపెట్టి.. షాద్‌నగర్‌ను సురక్షిత జోన్‌గా ఎంచుకున్న నయీమ్.. తన ముఖ్య అనుచరుడైన ఉసూర్ బాషాకు చెందిన ఇంట్లో మకాం వేశాడు. కుటుంబసభ్యులతో వచ్చి వెళ్తుండేవాడు. డిచ్పల్లికి చెందిన రియల్టర్‌ను కోటి రూపాయలు కావాలని బెదిరించిన కేసును విచారిస్తున్న పోలీసులు.. షాద్‌నగర్ ప్రాంతం నుంచే నయీమ్ ఫోన్ చేస్తున్నట్లు సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అతడికి సహకరిస్తున్నారని అనుమానం ఉన్నవారి కదలికలపై 20 రోజులుగా ప్రత్యేక నిఘా ఉంచారు. ఉసూర్ బాషా ఇంటికి నయీమ్ పలువురు మహిళలతో తరచూ వస్తున్నాడని గుర్తించారు. సోమవారం ఉదయం నయీమ్ ఆ ఇంటిలోనే మకాం వేశాడని పక్కాగా ధ్రువీకరించుకున్న పోలీసులు తమ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ ఇంటి నుంచి ఉసూర్ బాషాతోపాటు పలువురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. షాద్‌నగర్.. ఎందుకు? హైదరాబాద్‌కు షాద్‌నగర్ అతి సమీపంలో ఉంది. ఇక్కడినుంచి గంటలో రాజధానికి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా సమీపంలో ఉంటుంది. షాద్‌నగర్‌కు వచ్చేందుకు రెండు మూడు దారులుంటాయి. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఒక్కో దారిలో రావొచ్చు. అలాగే షాద్‌నగర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వారు నివాసం ఉంటారు. ఎవరెవరు ఉంటారో పక్కింటి వారికి కూడా తెలియదు. అందుకే ఈ ప్రాంతాన్ని నయీమ్ సేఫ్ షెల్టర్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన కదలికలు తెలియకుండా ఉండేందుకు నయీమ్ ఎటు వెళ్లినా వాహనంలో మహిళలు ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వాడని, వారిని కూడా తరచూ మారుస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఇంటిని సోదా చేయడానికి వెళ్లాం: ఎస్పీ రెమా రాజేశ్వరి షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో జరిగిన ఎన్కౌంటర్లో నయీముద్దీన్ మరణించాడని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎన్కౌంటర్ తర్వాత ఘటనాస్థలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘గతనెల 16న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ వ్యాపారిపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు అక్కడ ఫిర్యాదు నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆ గ్యాంగ్ కోసం విచారణ జరుపుతుండగా షాద్‌నగర్ ప్రాంతం నుంచి ఆ వ్యాపారికి బెదిరింపులు వెళ్లాయని నిర్ధారించుకున్నాం. ఈ క్రమంలో మిలినీయం కాలనీలోని ఓ ఇంటిని సోదా చేయడానికి పోలీసు బృందాలతో వెళ్లాం. అప్పటికే ఆ ఇంటినుంచి పోలీసులను చూసి కొందరు కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్త్తి ముందు కాల్పులు జరిపాడు. పోలీసులు ప్రతిఘటించడంతో డ్రైవర్ పారిపోయాడు. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి కాల్పులు కొనసాగించాడు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. కాల్పుల అనంతరం ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించగా నయీమ్‌గా గుర్తించాం’’ అని ఆమె వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్థలాన్ని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ పరిశీలించారు. షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఆత్మరక్షణ కోసమే నయీంపై కాల్పులు!
మహబూబ్‌నగర్ : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం ఎన్కౌంటర్ ఘటనపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్‌ను వెంబడించాం. అయితే, కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తే నయీం అని తర్వాత తేలింది' అని ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారిన నయీం పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు, రాజకీయ నాయకులూ సైతం ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 50కి పైగా హత్యలు, పలు బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నక్సలైట్‌గా తన జీవిత ప్రస్థానం ప్రారంభించిన నయీం అనంతరం హత్యలు, దోపిడీలు, దందాలతో కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంటిపై పోలీసుల జరిపిన దాడిలో పట్టుబడ్డ డబ్బును లెక్కించడానికి 4 క్యాష్ కౌంటింగ్ మిషన్లు వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నయీం ఆర్థిక పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. నయీం 'సాక్షి' వెబ్సైట్ సమగ్ర కథనాలు ఇవి..! 1. ఎవరీ నయీం? 2. షాద్ నగర్ లో కాల్పులు, నయీం హతం 3. 'పక్కా సమాచారంతోనే స్కెచ్' 4. నయీం జాడ ఎలా దొరికిందంటే..? 5. నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు! 6. నయీం చనిపోవడం ఆనందంగా ఉంది : సాంబశివుడు తండ్రి 7. పోలీసుల అదుపులో నయీం కుటుంబసభ్యులు -
నయీం జాడ ఎలా దొరికిందంటే..?
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ్పీటీసీ భర్త గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్‌స్టర్ నయీం జాడ పోలీసులకు దొరికింది. ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసి నయీం షాద్ నగర్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ నయీం ముఠా గత జూలైలో గంగాధర్‌ను బెదిరించింది. దీంతో ఆయన గత నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం ముఠా కదిలికలపై నిఘా వేయడంతో పాటు ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేశారు. వాళ్లు షాద్ నగర్లో ఉన్నట్టు పక్కాగా సమాచారం వచ్చింది. నయీం ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతని అనుచరుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నయీం హతమయ్యాడు. -
నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు!
నల్లగొండ: భువనగిరిలో గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు నయీం అనుచరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మిర్యాలగూడలో నయీం అత్త, ఆమె అక్క ఇళ్లల్లో సోదాలు చేసి 6.50 లక్షల రూపాయల నగదు, రెండు బ్యాగుల్లో డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో నయీం ఇంట్లోను, అతని అనుచరుల ఇళ్లల్లోను తనిఖీలు చేపట్టారు. పోలీసులు భువనగిరి ఎంపీపీ వెంకట్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో పోలీసులు సోదాలు చేసి నయీం అనుచరులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం అనుచరుల ఇంట్లో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. పోలీసులు రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు నయీం ఈ ఇంటిని అడ్డాగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ రమా రాజేశ్వరి పరిశీలించారు. పోలీసులు నయీం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నయీం భార్య, కూతురు, అత్త, బావమరిది ఉన్నారు. -
దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ నయీమ్
-
ఆత్మరక్షణ కోసమే కాల్పులు
-
ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ : షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్‌ను వెంబడించారన్నారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్లు ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. చనిపోయిన వ్యక్తి నయీంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు నయీం భార్య, కుటుంబసభ్యులు ఉన్నట్లు అనుమానంతో నార్సింగ్ లోని ఓ అపార్ట్‌మెంట్‌ను పోలీసులు చుట్టుముట్టారు. కాగా నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. -
ఎవరీ నయీం?
-
'పక్కా సమాచారంతోనే స్కెచ్'
హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్ మెన్ ముందుగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది. అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నయీం ముఠాకు చెందిన పలువురు కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య కేసులతో పాటు భూ దందా, సెటిల్మెంట్లు కేసులు కూడా నయీంపై ఉన్నాయి. -
ఎవరీ నయీం?
సాక్షి, హైదరాబాద్: నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఉమ్మడి రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. నక్సలైట్ నుంచి కోవర్టుగా నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు. ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటారని వినిడికి. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతే ఇందుకు కారణమని తెలుస్తోంది. దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్‌కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కడా బయటికి రాకుండా నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు! అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు.