అన్ని జిల్లాల్లో అమలుకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యవస్థను పోలీస్ శాఖలోనూ అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. పోలీస్ శాఖ ఎన్‌ఫోర్స్ మెంట్ విధానంలో క్యాష్‌లెస్‌ను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణ ప్రసాద్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో శనివారం సమీక్ష జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలోని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న ఈ–చలాన్ వ్యవస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ కమిషన రేట్‌లోని ఈ–చలాన్ సాఫ్ట్‌వేర్, సర్వర్లు, సిబ్బంది శిక్షణపై ఎస్పీలు ఆధ్యయనం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. క్యాష్‌లెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఈ–చలాన్ విధానంపై జిల్లాల పోలీస్ సిబ్బందికి శిక్షణనివ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఖర్చుపై పోలీస్ కంప్యూటర్ సర్వీ సెస్ అదనపు డీజీపీ నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది.
పోలీస్ శాఖలో క్యాష్‌లెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్
Published Sun, Jan 8 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
Advertisement