
అధికారుల కృషి వల్లే ఆ గుర్తింపు: డీజీపీ
అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. డీజీపీ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 ఉత్తమ సేవాపతకాలు, 55 పోలీస్ మెడల్స్‌ను అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు వినూత్నమైన కార్యాచరణతో పోలీస్ శాఖ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రానికి 26 గ్యాలంటరీ అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులను 2016 స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందజేశారు.