ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు: డీజీపీ | Asiya Andrabi travelled to Hyderabad | Sakshi
Sakshi News home page

ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు: డీజీపీ

Published Wed, Dec 30 2015 3:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు: డీజీపీ - Sakshi

ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు: డీజీపీ

హైదరాబాద్ : వేర్పాటువాది అసియా ఆంద్రాబి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి వస్తున్న వార్తలపై డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. ఆంద్రాబీ హైదరాబాద్ పర్యటనపై వార్తలు వస్తున్న మాటల వాస్తవమేనని ఆయన అన్నారు.  అయితే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు ఖచ్చితమైన సమాచారం లేదన్నారు. ఆమె రాకను ధ్రువీకరించాల్సి ఉందని, ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. 

 

కాగా కశ్మీర్ వివాదాస్పద మహిళ నేత ఆంద్రబీ గతేడాది హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం.  సిమి వ్యవస్థాపకుడు సలావుద్దీన్ కుటుంబాన్ని ఆమె కలిసినట్లు తెలుస్తోంది. ఇక నాగపూర్లో పట్టుబడిన ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఆంద్రాబిని కలిశారనే దానిపై తమవద్ద సమాచారం లేదన్నారు. ఇటీవల ఐసిస్లో చేరేందుకు యత్నించిన ముగ్గురు హైదరాబాదీ యువకులు ఆమెను కలిసినట్లు వార్తలు వినవస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement