పోలీసు సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు! | Changes in the Police Service Rules! | Sakshi
Sakshi News home page

పోలీసు సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు!

Published Wed, Mar 1 2017 4:15 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

పోలీసు సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు!

పోలీసు సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు!

ఉమ్మడి సర్వీసు రూల్స్‌ కారణంగా సమస్యలు
అనవసరపు విభాగాలకు స్వస్తి చెప్పాలని సర్కారు యోచన
కొత్త రూల్స్‌కోసం రిటైర్డ్‌ డీఐజీ గంగాధర్‌ నేతృత్వంలో కమిటీ


సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలో సర్వీసు నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రూల్స్‌నే అన్వయించుకున్న పోలీసు శాఖ.. తాజాగా కొత్త సర్వీసు నిబంధనలతో ముందుకు రానుంది. డీజీపీ అనురాగ్‌శర్మ దీనికి సంబం ధించి రిటైర్డ్‌ డీఐజీ గంగాధర్‌ నేతృత్వంలో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఏవోలు వెంకయ్య, దశరథ్‌రెడ్డి, ఆదినారా య ణ, యూసఫ్‌ మొయినుద్దీన్, రిటైర్డ్‌ సూపరిం టెండెంట్‌ విశ్వం సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రస్తుత సర్వీసు రూల్స్‌ను పరిశీలించి.. మార్పులు, కొత్త నిబం ధనల రూపకల్పనకు  సిఫార్సులు చేస్తుంది.

ఆ రూల్స్‌తో ఇబ్బందులు: రాష్ట్ర విభజన తర్వాత అన్వయించుకున్న ఏపీ పోలీసు సర్వీసు రూల్స్‌తో పలు సమస్యలు నెలకొన్నాయి. నియామకాలు, పదోన్నతులు, సర్వీసు ప్రయో జనాలు, ఇంక్రిమెంట్లు వంటి 16 రకాల సమస్యలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హోం శాఖ సర్వీసు రూల్స్‌ను సమీక్షించి.. రాష్ట్ర పోలీసు అడ్మిన్‌ వ్యవహా రాలు, ఆపరేషన్స్‌ వ్యవహారాలకు తగ్గట్టుగా రూపొందించుకోవాలని నిర్ణయించింది.

అనవసరపు విభాగాలకు స్వస్తి
ఉమ్మడి రాష్ట్రంలో 256కు పైగా ఐపీఎస్‌ అధికారులు పనిచేసే పోస్టులుండేవి. దాంతో అవసరమున్నా, లేకపోయినా ప్రతి విభాగా నికి ఐజీ నుంచి డీజీ స్థాయి హోదా వరకు ఉన్న అధికారులకు పోస్టులు ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో సర్వీసు రూల్స్‌పై ఏర్పాటు చేసిన కమిటీకే.. పోలీసు శాఖలోని అనవసరపు విభాగాలను తొలగించే పని కూడా అప్పగిం చారు. ఒకే తరహా పనులు చేసే రెండు మూడు విభాగాలుంటే వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు.

తొలగిపోనున్న కీలక సమస్యలు రాష్ట్ర విభజనలో ఇప్పటివరకు సివిల్‌ డీఎస్పీ, అదనపు ఎస్పీలు, నాన్‌ కేడర్‌ ఎస్పీల విభజన పూర్తి కాలేదు. డీఎస్పీ స్థాయి అధికారుల సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో ఇప్పటివరకు కమల్‌నాథన్‌ కమిటీ విభజన చేయలేక పోయింది. పైగా కొందరు అధికారులు కోర్టుల నుంచి స్టే తీసుకువచ్చారు. సర్వీసు రూల్స్‌లో లోపాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రూల్స్‌ మారిస్తే సమస్యలు తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

కమిటీ దృష్టి సారించే అంశాలివే...
సర్వీసు రూల్స్‌ కమిటీ మొత్తం 34 అంశాలను సమీక్షించి, నూతన నిబంధ నలను రూపొందించనుంది. స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్లలోని కానిస్టేబుల్‌ నుంచి డీఐజీ వరకు ఉన్న రూల్స్‌ మార్పు; ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లోని రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి కమాండెంట్‌ వరకు రూల్స్‌ సమీక్ష, మార్పు; పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ నుంచి డైరెక్టర్‌ హోదా వరకు ఉన్న నిబంధనలు, సివిల్‌ విభాగంలో కానిస్టేబుల్‌ నుంచి నాన్‌ కేడర్‌ ఎస్పీ వరకు రూల్స్‌ను సమీక్షించనున్నారు.

అదే విధంగా సీపీఎల్‌ అంబర్‌పేట్, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్, ఇంటలిజెన్స్‌ విభాగం, ప్రింటింగ్‌ విభాగం, పోలీసు అకాడమీ, పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్, పోలీస్‌ లీగల్‌ అండ్‌ మెడికల్‌ సర్వీ సెస్, పోలీస్‌ సెక్రటేరియట్‌ ఎస్టాబ్లిష్‌మెం ట్, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ), పోలీస్‌ కమ్యూనికేషన్స్, సబార్డి నేట్‌ రూల్స్, పీటీవో సబార్డినేట్‌ రూల్స్, ఇంటలిజెన్స్‌ సబార్డినేట్‌ రూల్స్, ఏపీ పోలీస్‌ మాన్యువల్, స్పెషల్‌ పోలీస్‌ మాన్యువల్, కంప్యూటర్స్, సీఐడీ అడ్‌హక్‌ రూల్స్‌ 1981, ఏపీ మినిస్టీరియల్‌ సర్వీసు రూల్స్‌లను పూర్తి స్థాయిలో సమీక్షించి నూతన నిబంధనలను సిఫారసు చేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement