
ముగిసిన ఖురేషీ అంత్యక్రియలు
హైదరాబాద్: మక్కా మసీదు కతీబ్, ఇమాం మౌలానా హాఫీజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ అల్ జహాదీ అంత్యక్రియలు బుధవారం మిశ్రీగంజ్‌లో ముగిశాయి. పాతబస్తీ పంచమొహల్లాకు చెందిన ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం మక్కా మసీదుకు తరలించి నమాజ్-ఏ-జనాజా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు అత్యధిక సంఖ్యలో మక్కా మసీదుకు చేరుకొని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మిశ్రీగంజ్ వరకు కొనసాగిన అంతిమ యాత్ర అనంతరం అబ్దుల్లా షా సాబ్ దర్గా వద్ద అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ రాష్ర్ట డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు పలువురు మత పెద్దలు, అధికార అనధికార ప్రముఖులు మక్మా మసీదుకు చేరుకొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.
బుధవారం మక్కా మసీదులో మౌలానా హాఫీజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ భౌతిక కాయాన్ని చూసేందుకు భారీగా వచ్చిన ప్రజలు