రాష్ట్రంలో 11 మంది డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో దాదాపు ఎనిమిది మంది వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీలను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. ఎస్.మల్లారెడ్డిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డీఎస్పీగా, పి.సంజీవ్‌కుమార్‌ను నిజామాబాద్ డీటీసీగా, ఎంఏ రెహమాన్‌ను ఆదిలాబాద్ ఎస్‌బీ డీఎస్పీగా నియమించారు. మిగతా డీఎస్పీలందరికీ కూడా హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.