నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు | mla putta madhu meets telangan dgp on nayeem case | Sakshi
Sakshi News home page

నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు

Published Thu, Oct 27 2016 4:40 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు - Sakshi

నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే పుట్టా మధు డీజీపీ అనురాగ్ శర్మకు చెప్పారు. గురువారం డీజీపీని కలిసిన ఆయన నయీం గ్యాంగ్ తదితర అంశాల గురించి డీజీపీకి వివరించారు. నయీంతో కలిసి ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి పలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

నయీం గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని పుట్టా మధు చెప్పారు. నయీంతో మాజీ మంత్రికి ఉన్న సంబంధాలపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. సదరు మాజీ మంత్రి చేసిన భూకబ్జాల వివరాలను డీజీపీకి సమర్పించినట్లు తెలిపారు. డీజీపీ సానుకూలంగా స్పందించి ఆధారాలను సిట్కు పంపిస్తామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement