‘బోధన్’ కుంభకోణంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం
సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఒక్కసారిగా వేగం పెంచింది. నిందితుల ఆచూకీని పసిగట్టి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ కేసులో ప్రమేయమున్నట్లుగా ఆరోపణలున్న నిజామాబాద్ ఏసీటీవో విజయ్‌కృష్ణ సోమవారం బోధన్ కోర్టులో లొంగిపోయాడు. ప్రధాన నిందితుడిగా ఉన్న టాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌ను సీఐడీ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వీరితో పాటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి ద్వారా మిగిలిన సూత్రధారుల వివరాలను సీఐడీ అధికారులు రాబడుతున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల్లోనూ వణుకు మొదలైంది. ప్రధానంగా శివరాజ్‌తో లావాదేవీలు నడిపిన ఇద్దరు జాయింట్ కమిషనర్లు, నలుగురు సీటీవోలు, ఆరుగురు డీసీటీవోలకు సంబంధించి ఇప్పటికే సీఐడీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
పోలీసుల అదుపులో కీలక నిందితుడు!
Published Tue, Mar 7 2017 3:13 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement