
చిట్టీలు అందిస్తోన్న యువకుడు
బోధన్ టౌన్ : పట్టణంలోని బీటీనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పరీక్ష కేంద్రంలో చిటీలు అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సోమవారం హాల్‌చల్ చేస్తున్నాయి. కొందరు యువకులు పరీక్ష కేంద్రం వద్ద చిటీలు అందించడానికి గోడలు ఎక్కిన దృశ్యాలను, విద్యార్థి సంఘాల నాయకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పరీక్షకేంద్రాల వద్ద పకడ్భందీగా ఏర్పాటుచేశామని, మాస్‌కాపీయింగ్‌కు తావులేదని అధికారులు చెబుతున్నా, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదికాగా సోమవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను డీఈవో నాంపల్లి రాజేశ్ తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment