
సాక్షి,బోధన్: బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఆర్మూర్‌కు చెందిన అల్జాపూర్ శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించింది. ఆదివారం మధ్యాహ్నమే మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారుచేసిన ఆ పార్టీ నాయకత్వం.. బోధన్‌కు మాత్రం అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో రేకెత్తింది. చివరకు అర్ధరాత్రి వేళ అభ్యర్థిని ప్రకటించడంతో ఉత్కంఠ వీడిపోయింది.
టికెట్ కోసం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఎట్టకేలకు అభ్యర్థి పేరు ఖరారు కావడంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో పార్టీ ఉండబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment