రైస్‌మిల్స్‌పై విజిలెన్స్‌ పంజా | pds rice illegally transport in Bodhan | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్స్‌పై విజిలెన్స్‌ పంజా

Published Wed, Oct 18 2017 11:44 AM | Last Updated on Wed, Oct 18 2017 11:44 AM

pds rice illegally transport in Bodhan

బోధన్‌రూరల్‌(బోధన్‌): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో విజిలె న్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారు లు పంజా విసిరారు. కొద్ది రోజులుగా మాటు పెట్టిన వారు సోమ వారం అర్థరాత్రి నుంచి నిఘా పెట్టి దాడులు చేశారు. పట్టణ శివారులోని సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్‌లో రూ.36 లక్షలు విలువ చేసే 1500 క్వింటాళ్ల బియ్యాన్ని, ఓ లారీని, ఆటోను సీజ్‌ చేశారు. రెండు మిల్లుల యజమానిపై కేసు నమోదు చేశారు. అనంతరం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ కేఆర్‌ నాగరాజు మా ట్లాడారు. బోధన్‌లో కొద్ది రోజులుగా పీడీఎస్‌ రైస్‌ను తక్కువ ధరకు కొని రీసైకిలింగ్‌ చేసి తిరిగి ఎక్కు వ ధరకు అమ్మడం, దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చి అమ్మడం వంటి అక్రమాలు సాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిం దన్నారు. దీంతో అనుమానం వచ్చి రైస్‌ మిల్లులపై నిఘా పెట్టామన్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రభాకర్‌ అనే వ్యక్తి చెందిన సూర్య, చంద్ర రైస్‌మిల్లులకు పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండడంతో పట్టుకున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని ప్రభాకర్‌ రెడ్డి రైస్‌మిల్లులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటి ని విచారణకు ఉన్నతాధికారులకు పం పించామన్నారు. సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్‌ యాజమాని ప్రభాకర్‌రెడ్డిపైక్రిమి న ల్‌ కేసు నమోదు చేశామన్నా రు. పట్టుబడిన బియ్యాన్ని పరీక్షల కో సం పంపించామని చెప్పారు. నివేదిక లు వచ్చాకమరిన్ని చర్యలు తీసుకుంటా మనివెల్లడించారు.  

అధికారుల నిఘా, మెరుపు దాడులు..
మంగళవారం తెల్లవారుజామున ఆటో (టీఎస్‌16 యూబీ 3859)లో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా రైస్‌ మిల్లుకు తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు వెంబడించారు. పట్టణానికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన చంద్ర ఇండస్ట్రీస్‌లోకి ఆటో వెళ్లగా, అధికారులు పట్టుకున్నారు. తనిఖీలు చేసి భారీగా బియ్యం నిల్వలను గుర్తించారు. అనంతరం పక్కనే ఉన్న మరో రైస్‌మిల్‌ సూర్య ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తనిఖీలు చేయగా నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వలను గుర్తించారు. వీటి పత్రాలు, వివరాలు సక్రమంగా లేక అధికారులు సీజ్‌ చేశారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..
పీడీఎస్‌ బియ్యంతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నాగరాజు హెచ్చరించారు. బోధన్‌లో చేసిన దాడుల అనంతరం ఆయన మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి, మెద క్, సిద్దిపేట, మేడ్చల్‌ జిల్లాల్లో నిరంతరం దాడులు చేస్తున్నామన్నారు. ఐదు జిల్లాలో ఎక్కడైనా పీడీఎస్‌ బియ్యంపై అక్రమాలకు పాల్పడితే 80082 03377కు సమాచారం అందించాలని కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ శ్రీనివాస్, డీసీటీవో ఉపేందర్, సీఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఎస్‌ఐ సంగమేశ్వర్‌ గౌడ్, హెచ్‌సీ లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లు శివానంద్, శివకుమార్, సుదర్శన్, డీఈ రమణ, ఏఆర్‌ రమేశ్, బోధన్‌ తహసీల్దార్‌ గంగాధర్, డీటీ వసంత, శశి భూషన్, అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement