Illegally Transport
-
అమెరికాలో ఐదుగురు భారతీయుల అరెస్ట్
న్యూయార్క్: అమెరికాలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఐదుగురు భారతీయులను న్యూయార్క్ అధికారులు నిర్బంధించారు. 15న ఓ అమెరికన్ తన వాహనంలో ఐదుగురు భారతీయులను తీసుకువస్తూ మోరిస్టౌన్ చెక్‌పాయింట్‌ను దాటేందుకు యత్నించాడు. అధికారులు అనుమానించడంతో ఆ వాహనాన్ని సమీపంలోని దుకాణం వద్ద ఆపాడు. దీంతో అందులో ఉన్న భారతీయులు దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. అధికారులు లోపలికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని తేలింది. దీంతో ఆ ఐదుగురినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో భారతీయుల సంఖ్య 9 వేలకు పైమాటే. లండన్‌లో ఐదుగురు భారతీయులు లండన్: డ్రగ్స్, మనీ లాండరింగ్ దందా నడుపుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును బ్రిటన్ దర్యాప్తు విభాగం రట్టు చేసింది. ఇందుకు సంబంధించి అరెస్టయిన 10 మందిలో ఐదుగురు భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరంతా కలిసి మూడేళ్లలో 15.5 మిలియన్ పౌండ్లను (రూ.143 కోట్లు) దుబాయికి దొంగతనంగా సూట్‌కేసుల్లో తరలించి, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. -
తమిళ బియ్యం పట్టివేత
సాక్షి, పలమనేరు : తమిళనాడు నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం పలమనేరులో చోటుచేసుకుంది. మొత్తం 160 మూటల బియ్యాన్ని సీజ్ చేశారు. వివరాలు..స్థానిక ఫాదర్స్ బంగ్లా వద్ద తమిళ బియ్యం అక్రమ రవాణా సాగుతోందనే సమాచారం అందడంతో కొన్ని రోజులుగా స్థానిక పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో అక్కడ దాడులు చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన బొలెరో వాహనంతో సహా అందులోని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వాహన డ్రైవర్ పేరు సద్దాం అని, అక్కడ ఓ ఇంట్లో బియ్యాన్ని దాచి మళ్లీ కర్ణాటకకు పంపుతున్నట్టు తేలిం ది. దీంతో అక్కడ స్టాకు ఉన్న బియ్యం, వాహనంలోని మొత్తం 160 సంచుల బియ్యాన్ని సీజ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం సరఫరాచేసే బియ్యాన్ని అక్కడి ఏజెంట్ల ద్వారా ఇక్కడి స్మగ్లర్లు కొనుగోలు చేసి దాన్ని గుట్టుగా కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తున్నట్టు బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం కేసును రెవెన్యూ శాఖకు పంపనున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
రొద్దం: పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిపోకుండా చెక్‌పెట్టేందుకు గట్టి నిఘా ఉంచాలని ఎస్పీ అశోక్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం రొద్దం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. పలు రికార్డులను క్షణ్ణంగా తనిఖీ చేసి, పెండింగ్ కేసుల గురించి ఎస్ఐ సురేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కేవలం ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే ఇసుకను తవ్వుకోవాలన్నారు. అలా కాకుండా కర్ణాటకకు తరలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు లక్ష రూపాయల వరకు అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. తాము పట్టకున్న ఇసుక ట్రాక్టర్లను ఆర్డీఓకు అప్పగిస్తున్నట్లు ఎస్ఐ చెప్పగా... ఆర్డీఓకు కాకుండా మీరే కేసులు నమోదు చేసి, ఇసుక తరలిస్తున్న వ్యక్తులను రింమాండ్‌కు పంపాలని ఆదేశించారు. పెద్దమంతూరు, నల్లూరు, నారనాగేపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుక తరలిపోతున్నట్లు ఎస్పీ దష్టికి తెచ్చారు. ఇసుక రీచులు ఏర్పాటు చేసేవిధంగా ఆర్డీఓతో చర్చించాలని డీఎస్పీ వెంకటరమణకు సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన స్ధలం పెంద్దాంజనేయస్వామి దేవాలయానికి ఇవ్వాలని అర్చకుడు గిరీష్స్వామి ఎస్పీని కోరారు. స్టేషన్ వెనక భాగంలో ఉన్న స్థలం దేవాలయానికి కేటాయిస్తే, ఇటీవల దేవాలయం కోసం తాము కొనుగోలు చేసిన స్థలం పోలీస్‌స్టేషన్‌కు ఇస్తామని తెలిపారు. ఇందుకు ఎస్పీ స్పందిస్తూ స్థల విషయం ఉన్నాతాధికారులతో మాట్లాడుతానన్నారు. కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, సోమందేపల్లి ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైస్‌మిల్స్‌పై విజిలెన్స్ పంజా
బోధన్‌రూరల్(బోధన్): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో విజిలె న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారు లు పంజా విసిరారు. కొద్ది రోజులుగా మాటు పెట్టిన వారు సోమ వారం అర్థరాత్రి నుంచి నిఘా పెట్టి దాడులు చేశారు. పట్టణ శివారులోని సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్‌లో రూ.36 లక్షలు విలువ చేసే 1500 క్వింటాళ్ల బియ్యాన్ని, ఓ లారీని, ఆటోను సీజ్ చేశారు. రెండు మిల్లుల యజమానిపై కేసు నమోదు చేశారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఎస్పీ కేఆర్ నాగరాజు మా ట్లాడారు. బోధన్‌లో కొద్ది రోజులుగా పీడీఎస్ రైస్‌ను తక్కువ ధరకు కొని రీసైకిలింగ్ చేసి తిరిగి ఎక్కు వ ధరకు అమ్మడం, దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చి అమ్మడం వంటి అక్రమాలు సాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిం దన్నారు. దీంతో అనుమానం వచ్చి రైస్ మిల్లులపై నిఘా పెట్టామన్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రభాకర్ అనే వ్యక్తి చెందిన సూర్య, చంద్ర రైస్‌మిల్లులకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండడంతో పట్టుకున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని ప్రభాకర్ రెడ్డి రైస్‌మిల్లులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటి ని విచారణకు ఉన్నతాధికారులకు పం పించామన్నారు. సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్ యాజమాని ప్రభాకర్‌రెడ్డిపైక్రిమి న ల్ కేసు నమోదు చేశామన్నా రు. పట్టుబడిన బియ్యాన్ని పరీక్షల కో సం పంపించామని చెప్పారు. నివేదిక లు వచ్చాకమరిన్ని చర్యలు తీసుకుంటా మనివెల్లడించారు. అధికారుల నిఘా, మెరుపు దాడులు.. మంగళవారం తెల్లవారుజామున ఆటో (టీఎస్16 యూబీ 3859)లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రైస్ మిల్లుకు తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు వెంబడించారు. పట్టణానికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన చంద్ర ఇండస్ట్రీస్‌లోకి ఆటో వెళ్లగా, అధికారులు పట్టుకున్నారు. తనిఖీలు చేసి భారీగా బియ్యం నిల్వలను గుర్తించారు. అనంతరం పక్కనే ఉన్న మరో రైస్‌మిల్ సూర్య ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తనిఖీలు చేయగా నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వలను గుర్తించారు. వీటి పత్రాలు, వివరాలు సక్రమంగా లేక అధికారులు సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. పీడీఎస్ బియ్యంతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నాగరాజు హెచ్చరించారు. బోధన్‌లో చేసిన దాడుల అనంతరం ఆయన మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి, మెద క్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో నిరంతరం దాడులు చేస్తున్నామన్నారు. ఐదు జిల్లాలో ఎక్కడైనా పీడీఎస్ బియ్యంపై అక్రమాలకు పాల్పడితే 80082 03377కు సమాచారం అందించాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్, డీసీటీవో ఉపేందర్, సీఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఎస్ఐ సంగమేశ్వర్ గౌడ్, హెచ్‌సీ లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లు శివానంద్, శివకుమార్, సుదర్శన్, డీఈ రమణ, ఏఆర్ రమేశ్, బోధన్ తహసీల్దార్ గంగాధర్, డీటీ వసంత, శశి భూషన్, అధికారులు పాల్గొన్నారు. -
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సిమెంటు
పన్ను ఆదాయంకోల్పోతున్న తెలుగు రాష్ట్రాలు * రోజుకు 6,000 టన్నుల సిమెంటు రాక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొందరు సిమెంటు వ్యాపారుల కారణంగా తెలుగు రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలకు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి సిమెంటు అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. గత కొంత కాలంగా ఈ తంతు జరుగుతోందని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌కు, ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు, అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి ఖమ్మంకు సిమెంటు రవాణా అవుతోంది. వివిధ రాష్ట్రాల్లో సిమెంటు ధరల తారతమ్యం ఉంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు దిగుమతిపై ఎంట్రీ ట్యాక్స్ లేకపోవడంతో వ్యాపారులు అదనుగా తీసుకుంటున్నారు. నెలకు రూ. 18 కోట్లు.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒరిస్సా నుంచి రోజుకు సుమారు 6 వేల టన్నుల సిమెంటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోందని సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో అమ్మకాలు నమోదు కావడంతో ఆ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఆదాయం రాకుండా పోతోంది. సిమెంటుపై వ్యాట్ 14.5% ఉంది. అంటే ఒక్కో బస్తాపై వ్యాట్ సుమారు రూ.45-50లు అవుతుంది. రోజుకు 6 వేల టన్నుల సిమెంటు దిగుమతి అవుతోందంటే ఈ లెక్కన నెలకు రూ.18 కోట్ల పన్ను ఆదాయాన్ని రెండు రాష్ట్రాలు చేజార్చుకుంటున్నాయి. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వ్యాపారికి సిమెంటు పంపాలంటే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్ ఇ-సుగమ్ ద్వారానే లావాదేవీలు జరపాల్సిందే. ఈ విధానంతో ఆ వ్యాపారి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి వ్యాట్ ఖచ్చితంగా వస్తుంది. ఇటువంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయి’ అని ఒక ప్రముఖ కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.