
బియ్యంతో సహాపోలీసులు సీజ్ చేసిన వాహనం
సాక్షి, పలమనేరు : తమిళనాడు నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం పలమనేరులో చోటుచేసుకుంది. మొత్తం 160 మూటల బియ్యాన్ని సీజ్ చేశారు. వివరాలు..స్థానిక ఫాదర్స్ బంగ్లా వద్ద తమిళ బియ్యం అక్రమ రవాణా సాగుతోందనే సమాచారం అందడంతో కొన్ని రోజులుగా స్థానిక పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో అక్కడ దాడులు చేశారు.
తమిళనాడు నుంచి వచ్చిన బొలెరో వాహనంతో సహా అందులోని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వాహన డ్రైవర్ పేరు సద్దాం అని, అక్కడ ఓ ఇంట్లో బియ్యాన్ని దాచి మళ్లీ కర్ణాటకకు పంపుతున్నట్టు తేలిం ది. దీంతో అక్కడ స్టాకు ఉన్న బియ్యం, వాహనంలోని మొత్తం 160 సంచుల బియ్యాన్ని సీజ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం సరఫరాచేసే బియ్యాన్ని అక్కడి ఏజెంట్ల ద్వారా ఇక్కడి స్మగ్లర్లు కొనుగోలు చేసి దాన్ని గుట్టుగా కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తున్నట్టు బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం కేసును రెవెన్యూ శాఖకు పంపనున్నట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment