రొద్దం: పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిపోకుండా చెక్‌పెట్టేందుకు గట్టి నిఘా ఉంచాలని ఎస్పీ అశోక్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం రొద్దం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. పలు రికార్డులను క్షణ్ణంగా తనిఖీ చేసి, పెండింగ్ కేసుల గురించి ఎస్‌ఐ సురేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కేవలం ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే ఇసుకను తవ్వుకోవాలన్నారు. అలా కాకుండా కర్ణాటకకు తరలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు లక్ష రూపాయల వరకు అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు.
తాము పట్టకున్న ఇసుక ట్రాక్టర్లను ఆర్డీఓకు అప్పగిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పగా... ఆర్డీఓకు కాకుండా మీరే కేసులు నమోదు చేసి, ఇసుక తరలిస్తున్న వ్యక్తులను రింమాండ్‌కు పంపాలని ఆదేశించారు. పెద్దమంతూరు, నల్లూరు, నారనాగేపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుక తరలిపోతున్నట్లు ఎస్పీ దష్టికి తెచ్చారు. ఇసుక రీచులు ఏర్పాటు చేసేవిధంగా ఆర్డీఓతో చర్చించాలని డీఎస్పీ వెంకటరమణకు సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన స్ధలం పెంద్దాంజనేయస్వామి దేవాలయానికి ఇవ్వాలని అర్చకుడు గిరీష్‌స్వామి ఎస్పీని కోరారు. స్టేషన్ వెనక భాగంలో ఉన్న స్థలం దేవాలయానికి కేటాయిస్తే, ఇటీవల దేవాలయం కోసం తాము కొనుగోలు చేసిన స్థలం పోలీస్‌స్టేషన్‌కు ఇస్తామని తెలిపారు. ఇందుకు ఎస్పీ స్పందిస్తూ స్థల విషయం ఉన్నాతాధికారులతో మాట్లాడుతానన్నారు. కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, సోమందేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment