‘ఎంపీ కవితపై అసత్య ఆరోపణలు తగవు’
బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా ఉండేందుకు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీల నుంచి నిజామాబాద్ ఎంపీ కవిత డబ్బులు తీసుకున్నారంటూ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్
చంద్రశేఖర్‌కాలనీ :
బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా ఉండేందుకు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీల నుంచి నిజామాబాద్ ఎంపీ కవిత డబ్బులు తీసుకున్నారంటూ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్‌డీఎస్‌ఎల్‌ను ఎందుకు టేకోవర్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో గల టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ఎంపీగా కొనసాగిన మధుయాష్కీ గౌడ్ జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. ఆయన హైదరాబాద్, ఢిల్లీలలో ప్రెస్‌మీట్‌లతోనే కాలం గడిపారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఎంపీ కవితపై మధుయాష్కీ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కా్రంగెస్ నాయకులు ఇప్పటి నుంచే టీఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తప్పుడు ఆరోపణలను మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు డాక్టర్ బాపురెడ్డి, ధర్మపురి సురేందర్, కోటగిరి గంగాధర్, ప్రభాకర్‌రెడ్డి, నవీద్ ఎక్బాల్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మురళి తదితరులు పాల్గొన్నారు.