సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంపై సీఐడీ చేపట్టిన దర్యాప్తుకు సహకరించడంలేదంటూ ఆ శాఖ అధికారులపై సీఎస్ ఎస్పీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్యాప్తుపై శనివారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
బోధన్, కామారెడ్డిల్లోనే కాకుండా నిజామాబాద్ రూరల్, అర్బన్ సర్కిల్ కార్యాలయల్లోనూ స్కాం సూత్రధా రి శివరాజ్ కుంభకోణాలకు పాల్పడ్డట్టు సీఎస్ దృష్టికి సీఐడీ తీసుకెళ్లింది. ఆరోపణ లెదుర్కొంటున్న అధికారుల జాబితా ఇవ్వాలని ఆ శాఖ అధికారులను కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, తాము 22 మంది అధికారులను విచారించాల్సి ఉంద ని సీఐడీ అధికారులు సీఎస్ దృష్టికి తీసు కెళ్లారు. దీనితో ఆయన వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులను తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. ఏ2గా ఉన్న సునీల్‌ను తాము గుర్తించామని, రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఐడీ ఉన్నతాధికారులు సీఎస్‌కు తెలిపారని సమాచారం.
(బోధన్ స్కాం.. ప్రధాన సూత్రధారికి గుండెపోటు!)
‘వాణిజ్య’ అధికారులపై సీఎస్ ఆగ్రహం
Published Sun, Mar 26 2017 3:24 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM
Advertisement
Advertisement