
సాక్షి, నిజమాబాద్ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌తో గొడవ తలెత్తి ఓ యువకుడిని బంధించిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కలకలం రేపింది. బోధన్‌కు చెందిన యువకులు, రెంజల్ మండలం కందకుర్తి చెందిన యువకులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాశారు. ఈ బెట్టింగ్‌లో కందకుర్తి గ్రామానికి చెందిన యువకులు ఓడిపోయారు. డబ్బు కోసం బోధన్ యువకులు కందకుర్తికి వెళ్లారు. అక్కడే ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో స్థానికులు వీరిని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత కందకుర్తికి చెందిన యువకుడు పనిపై బోధన్ వెళ్లాడు. అప్పుడే కందకుర్తి యువకుడిని బోధన్ యువకులు బంధించారు. డబ్బులు ఇవ్వమని యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయందోళనకు చెందిన యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు బోధన్ యువకులు, ఇద్దరు కందకుర్తి యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment