రాజమండ్రి: ప్రపంచకప్లో భారత్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును యాంటీ గుండా స్క్వాడ్ గురువారం రాజమండ్రిలో రట్టు చేసింది. స్థానిక సీతంపేట మూలగొయ్యి సెంటర్ వద్ద ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం యాంటీ గుండా స్క్వాడ్కు అందింది.
దాంతో సదరు ఇంటిపై యాంటీ గుండా స్క్వాడ్ అధికారులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లతోపాటు రూ. 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.