![Four Of Same Family Attempted Suicide At Bodhan RDO Office - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/16/suicide.jpg.webp?itok=3PnoH-Ng)
సాక్షి, నిజామాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన ఘటన సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చోటుచేసుకొంది. పెట్రోల్ బాటిళ్ళతో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తమ పంట పొలానికి వెళ్లే దారిని కబ్జా చేసి గేటు పెట్టారని ఆర్డీవోకు ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆర్డీవో గోపిరామ్... పొలానికి వెళ్లే దారిని చూపాలని ఈ మేరకు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment