ప్రియుడి వేధింపులు: వీడియో కాల్‌ చేసి ప్రియురాలి ఆత్మహత్య | Girlfriend Commits Suicide While Talking On Video Call With Boyfriend In Nizamabad | Sakshi
Sakshi News home page

వీడియో కాల్‌ చేసి ప్రియురాలి ఆత్మహత్య

Published Thu, Mar 11 2021 3:39 PM | Last Updated on Thu, Mar 11 2021 4:24 PM

Girlfriend Commits Suicide While Talking On Video Call With Boyfriend In Nizamabad - Sakshi

సాక్షి, గాంధారి(నిజామాబాద్‌): మండల పరిధిలోని మాధవపల్లి గ్రామానికి చెందిన యువతి రాయల సౌందర్య(21) నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల సౌందర్య బంధువైన లింగంపేట్‌ మండలం కొర్పోల్‌ గ్రామానికి చెందిర కర్రెల్లో స్వామి ఇరువురు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి నిశ్చయించిన కొన్ని రోజుల తర్వాత ప్రియుడు స్వామి అదనంగా రూ. 2 లక్షలతో పాటు బైక్‌ ఇప్పించాలని సౌందర్యను వేధించసాగాడు. 

పెద్దలు నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అదనపు కట్నం తెస్తేనే పెళ్లి చేసుకుంటానని లేదంటే వేరే అమ్మాయిని చూసుకుంటానని స్వామి తేగిసి చెప్పాడు. ఈ క్రమంలో గత నెల 18న సౌందర్య ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రియుడు స్వామితో వీడియో కాల్‌లో మాట్లాడింది. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరింది. ప్రియుడు నిరాకరించడంతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.

గాంధారిలోనే ఉన్న స్వామి వెంటనే సౌందర్య ఇంటికి చేరుకొని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వెళ్లి పోయాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల2న నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి రాయల సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement