
సాక్షి, బోధన్: మద్యం మత్తులో తొమ్మిదేళ్ల కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల కూతురిని ఇంట్లో ఉంచి తల్లి సోమవారం కూలి పనికి వెళ్లింది. సాయంత్రం సమయంలో మద్యం తాగి వచ్చిన తండ్రి షాదుల్ ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కూలి పని ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చే సరికి కూతురు ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో తల్లి బోధన్ రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment