బ్యాగు బరువుపై అవగాహన కార్యక్రమాలు
పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ తెలిపారు. బ్యాగు బరువు తగ్గించే విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకు బాధ్యత ఉందని, అందుకే అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం డైరెక్టరేట్‌లో టెట్ ఫలితాల వెల్లడి అనంతరం విలేకరులతో మాట్లాడారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర స్థాయిలోనూ త్వరలోనే చేపడతామన్నారు.