డేంజర్ జర్నీ
ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనచోదకులు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రమాదభరిత ప్రయాణం సాగిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్‌పై ఒకరికి ముగ్గురు కూర్చుని హెల్మెట్ కూడా లేకుండా రయ్..రయ్‌మని హైవేపై దూసుకుపోతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి స్కూలు పిల్లలు, ప్రయాణికులను ఎక్కించుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదో ఒక ఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే రవాణా శాఖ, పోలీసు అధికారులు ఈ నిబంధనల ఉల్లంఘనను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ఖాళీ సమయాల్లో మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతుండటంతో వాహనచోదకులు ఇలా ప్రమాదభరిత ప్రయాణం సాగిస్తున్నారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్